అరుణ గ్రహం పై ‘ ఒయాసిస్ ‘ ! వావ్ ! నాసా న్యూ డిస్కవరీ !

అంగారక (మార్స్) గ్రహంపై కనబడుతున్న వింతలు నాసా శాస్త్రజ్ఞులను సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేస్తున్నాయి. ఈ గ్రహం పైని ‘ గేల్ క్రేటర్ ” మీద పరిశోధనలు చేస్తున్న ‘ క్యూరియాసిటీ రోవర్ ‘ నిజంగానే క్యూరియాసిటీని పెంచుతోంది. 150 కి. మీ. వైశాల్యంతో కూడిన ఈ కొండలాంటి అడుగు భాగాన.. బహుశా కోట్ల ఏళ్ళ నాటి ‘ ఒయాసిస్ ‘ ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. రోవర్ నుంచి అందిన డేటాను విశ్లేషిస్తున్న రీసెర్చర్లు.. ఈ క్రేటర్ కిందిభాగంలో […]

అరుణ గ్రహం పై  ' ఒయాసిస్ ' ! వావ్ ! నాసా న్యూ డిస్కవరీ !
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 11, 2019 | 6:59 PM

అంగారక (మార్స్) గ్రహంపై కనబడుతున్న వింతలు నాసా శాస్త్రజ్ఞులను సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేస్తున్నాయి. ఈ గ్రహం పైని ‘ గేల్ క్రేటర్ ” మీద పరిశోధనలు చేస్తున్న ‘ క్యూరియాసిటీ రోవర్ ‘ నిజంగానే క్యూరియాసిటీని పెంచుతోంది. 150 కి. మీ. వైశాల్యంతో కూడిన ఈ కొండలాంటి అడుగు భాగాన.. బహుశా కోట్ల ఏళ్ళ నాటి ‘ ఒయాసిస్ ‘ ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. రోవర్ నుంచి అందిన డేటాను విశ్లేషిస్తున్న రీసెర్చర్లు.. ఈ క్రేటర్ కిందిభాగంలో అత్యంత పురాతనమైన.. మూడువందల కోట్ల ఏళ్ళ క్రితం ఒక ఒయాసిస్ ఉండేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ ఉప్పు ఖనిజాలతో కూడిన చిన్నపాటి జల చెలమలు ఉండేవని, కాల క్రమేణా అవి ఎండిపోతూ వచ్చాయని వీరు… ‘ నేచర్ జియో సైన్స్ ‘ అనే మ్యాగజైన్ లో రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. మార్స్ పైని వాతావరణం మొదట్లో తడిగా ఉండేదని, ఆ తర్వాత క్రమేపీ చల్లని ఐస్ క్లైమేట్ తో ‘ ఎడారి ‘ ప్రాంతంలా మారిందని వారు తెలిపారు. కాలిఫోర్నియాలోని పసడేనాలో గల’ జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ‘ లో ఈ శాస్త్రజ్ఞులు అంగారక గ్రహానికి సంబంధించిన విశేషాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మహా క్రేటర్ గాలి, నీటితో నిండిపోయింది. అనంతరం కోట్లాది సంవత్సరాలుగా అది గట్టిపడుతూ శిలా రూపంగా, కొండ ప్రాంతంగా మారుతూ వచ్చింది. ఫలితంగా ‘ మౌంట్ షార్ప్ ‘ అనే అనే జియాలాజికల్ ఫార్మేషన్ (కొండవంటి ప్రాంతం) ఏర్పడింది. దాన్నే క్యూరియాసిటీ రోవర్ అధిరోహిస్తోంది అని లీడ్ ఆథర్ అయిన విలియం రాపిన్ వెల్లడించారు. అక్కడి ప్రతి నమూనానూ,. లేయర్ నూ రోవర్ సేకరిస్తోందని, మార్స్ ని మార్చేస్తున్న గేల్ క్రేటర్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. 2017 లో తొలుత రోవర్ ఈ క్రేటర్ మీద ‘ అడుగు పెట్టినప్పుడు ‘.. 500 అడుగుల పొడవైన శిలా ఖండాలను కనుగొన్నట్టు ఆయన చెప్పారు. అక్కడి జియాలాజికల్ ఫార్మేషన్స్.లో కొన్ని.. . సౌత్ అమెరికా ఆల్టిప్లానో లోని ఉప్పునీటి సరస్సులను పోలి ఉన్నట్టు విలియం అభిప్రాయపడ్డారు.