అతని మెదడులో 700 పురుగులు.. ఆ మాంసం తిన్నందుకే…

ఉడికీ ఉడకని మాంసం తింటున్నారా.? టేస్ట్ బావుందని అదే పనిగా ఆ మాంసం కుమ్మేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ వార్త.. మీకు తరచూ తలనొప్పితో బాధపడుతూ.. ఎంతకు ఆ తలనొప్పి గనక తగ్గకపోతే, ఏం కాదులే అంటూ లైట్ తీసుకోకండి. వెంటనే సమీపంలోని వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే అది ప్రమాదకరమైన ‘టైనియాసిస్’ వ్యాధి అయి ఉండచ్చు. చైనాలో ఓ వ్యక్తి ఇలాగే విపరీతమైన తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్లాడు. సాధారణ తలనొప్పిగానే భావించిన వైద్యులు.. కొన్ని మందులు […]

అతని మెదడులో 700 పురుగులు.. ఆ మాంసం తిన్నందుకే...
Follow us

|

Updated on: Nov 22, 2019 | 8:54 PM

ఉడికీ ఉడకని మాంసం తింటున్నారా.? టేస్ట్ బావుందని అదే పనిగా ఆ మాంసం కుమ్మేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ వార్త.. మీకు తరచూ తలనొప్పితో బాధపడుతూ.. ఎంతకు ఆ తలనొప్పి గనక తగ్గకపోతే, ఏం కాదులే అంటూ లైట్ తీసుకోకండి. వెంటనే సమీపంలోని వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే అది ప్రమాదకరమైన ‘టైనియాసిస్’ వ్యాధి అయి ఉండచ్చు.

చైనాలో ఓ వ్యక్తి ఇలాగే విపరీతమైన తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్లాడు. సాధారణ తలనొప్పిగానే భావించిన వైద్యులు.. కొన్ని మందులు ఇచ్చి పంపించేశారు. అయినప్పటికీ, తలనొప్పి తగ్గకపోవడంతో ఈ సారి బ్రెయిన్ స్కాన్ చేశారు. అయితే స్కానింగ్ అనంతరం వచ్చిన రిపోర్టులను చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. అతని మెదడులో టేప్ వార్మ్స్ పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. మెదడుతో పాటు ఊపిరితిత్తులు, ఛాతీ భాగంలో కూడా వందల సంఖ్యలో ఈ పురుగుల్ని గుర్తించారు. మొత్తం 700కి పైగా ఈ టేప్‌వార్మ్స్ పురుగులు.. అతడి అవయవాలను చుట్టేసినట్లు వైద్యులు తెలిపారు.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ప్రాణాంతక వ్యాధి సోకింది. దీన్నే ‘టైనియాసిస్’ అని పిలుస్తారు. నెల రోజుల కింద.. ఎప్పుడో ఉడకని పంది మాంసం తినడం వల్ల ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకపోవడం వల్ల ఆ జంతువు శరీరంలో ఉండే టేప్‌వార్మ్ గుడ్లు బ్రతికే ఉంటాయని.. ఆ మాంసాన్ని మనం తిన్నప్పుడు టేప్ వార్మ్ గుడ్లు మన శరీరంలోకి చేరడంతో ఇలాంటి వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే, ఏ నాన్ వెజ్ ఫుడ్‌ అయినా..సరిగ్గా ఉడకనివ్వాలని, అప్పుడే అందులోని క్రిమికీటకాలు ఏమైనా ఉంటే చనిపోతాయని అంటున్నారు. లేనిపక్షంలో ఇలాంటి వ్యాధులకు గురవ్వాల్సిందేనని చెబుతున్నారు. సో.. మరి మీరు కూడా నాన్ వెజ్ తినేటప్పుడు అది సరిగ్గా ఉడికిందా లేదా అని చూడకుండా లాగించేస్తే.. ఇలాంటి ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!