China: చైనాను వణికిస్తున్న కరోనా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. లాక్ డౌన్ లో నగరాలు

చైనాలో (China) కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం జీరో కొవిడ్ వ్యూహాన్ని ప్రతిపాదించినా అది సరైన సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే డ్రాగన్ దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.....

China: చైనాను వణికిస్తున్న కరోనా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. లాక్ డౌన్ లో నగరాలు
Corona In China
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:55 AM

చైనాలో (China) కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం జీరో కొవిడ్ వ్యూహాన్ని ప్రతిపాదించినా అది సరైన సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే డ్రాగన్ దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. అక్కడి వైద్యాధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. జియాన్, షాంఘై (Shanghai) నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ కారణంగా చైనా ప్రభుత్వం షాంఘై ప్రజలకు ఇప్పటికే రేషన్ అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 13 మిలియన్లు జనాభా కలిగిన జియాన్ లో గతేడాది నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. తాజాగా చెత్తను రీసైక్లింగ్ చేసే సిబ్బందిలో కేసులు బయటపడ్డాయి. దీంతో తాత్కాలిక నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఉద్ధృతికి ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.5.2 కారణమని అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని కఠినమైన నిబంధనలుండే క్వారంటైన్‌లో నిర్బంధిస్తున్నారు. 50 రోజుల పాటు అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా నెగెటివ్ గా తేలిన 50 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నాకే బయటకు విడిచిపెడుతున్నారు. అంతే కాదు.. నెగెటివ్ వచ్చాక తమ కుటుంబసభ్యులను చూసేందుకూ కఠిన ఆంక్షలే అమలు చేస్తున్నారు. ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, వాటి మధ్యన బంధువులు, కుటుంబ సభ్యులను కలిసేలా ఏర్పాట్లు చేశారు. గత రెండు వారాల్లో పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల వారిని మాత్రమే బయటకు వదిలారు. లాక్‌డౌన్ సడలింపు ప్రకటన వెలువడగానే చాలా మంది ప్రజలు కంచెల వద్దకు వచ్చి తమవారి కోసం పడిగాపులు కావడం తీవ్ర ఆవేదన కలిగించింది.