జాన్సన్ & జాన్సన్ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు.. మార్కెట్‌లోకి సింగిల్‌ డోసు టీకా.. ఎప్పుడో తెలుసా..

Johnson and Johnson: జాన్సన్ & జాన్సన్ ఔషధ కంపెనీ కరోనా వ్యాక్సిన్ విషయంలో సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే సింగిల్ డోసు టీకాను మార్కెట్లోకి

  • uppula Raju
  • Publish Date - 12:07 am, Thu, 28 January 21
జాన్సన్ & జాన్సన్  కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు.. మార్కెట్‌లోకి సింగిల్‌ డోసు టీకా.. ఎప్పుడో తెలుసా..

Johnson and Johnson: జాన్సన్ & జాన్సన్ ఔషధ కంపెనీ కరోనా వ్యాక్సిన్ విషయంలో సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే సింగిల్ డోసు టీకాను మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమ కంపెనీ నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ఈ వారంలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఫలితాల వెంటనే ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించింది.

ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు దాదాపు 57 దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, కొవాగ్జిన్‌తో పాటు రష్యా, చైనా దేశాల్లోనూ మరికొన్ని టీకాలు అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ తప్పనిసరిగా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. జాన్సన్‌ & జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఒకే డోసు సరిపోతుందని ప్రకటించింది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే దీన్ని నిలువ ఉంచుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ప్రయోగ ఫలితాలను వారంలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..