America on Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఉక్కుపాదం.. ట్రంప్ రియాక్షన్ ఏమంటే..?

|

Nov 29, 2024 | 2:00 PM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస, హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు కారణంగా కొనసాగుతున్న ఉద్రిక్తత గురించి భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా భారతదేశం తన స్వరాన్ని పెంచుతోంది. ఇప్పుడు భారత్‌కు అమెరికా మద్దతు కూడా లభించింది. ఈ విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు అండగా నిలుస్తుందని అమెరికా నుంచి ఒక ప్రకటన స్పష్టం చేసింది.

America on Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఉక్కుపాదం.. ట్రంప్ రియాక్షన్ ఏమంటే..?
America On Bangladesh Violence
Follow us on

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి అమెరికా వైపు నుంచి ఒక భారీ ప్రకటన వెలువడింది. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్‌ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదని ట్రంప్ సలహాదారు.. మాజీ USCIRF కమీషనర్ జానీ మూర్ అన్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితిని బిడెన్ ప్రభుత్వం విస్మరిస్తున్నప్పటికీ.. అమెరికాలో ప్రభుత్వం మారబోతుందనేది ప్రధాన వాస్తవం, సాటిలేని విదేశాంగ విధానంతో ట్రంప్ ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. అవును ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నారని.. అమెరికా విలువలతో నిండిన ట్రంప్ బృందం మెరుగైన భవిష్యత్తు కోసం పనిచేస్తుందని మూర్ చెప్పారు.

బంగ్లాదేశ్ హింసపై అమెరికా కీలక ప్రకటన

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అమెరికా వైఖరి గురించి మూర్‌ స్పందిస్తూ బిడెన్ ప్రభుత్వంతో పోలిస్తే ట్రంప్ ప్రభుత్వం భిన్నంగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ప్రపంచంలోనే పరిష్కరించలేని సవాలు అంటూ ఏదీ లేదన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా యుద్ధాలు జరుగుతున్నాయని.. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని మూర్ అన్నారు. ట్రంప్ మొదటి టర్మ్‌లో మానవ హక్కులలో మత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తాను హమీనిస్తున్నట్లు జానీ మూర్ చెప్పారు.

భారతదేశం అమెరికాకు ముఖ్యమైన మిత్రదేశం.. మూర్

అమెరికా అనేక విధాలుగా విదేశాంగ విధానానికి కేంద్రంగా ఉంది. ఈసారి కూడా ట్రంప్ నేతృత్వంలో అలాంటిదే చూస్తారు. ట్రంప్ బృందం భారతదేశాన్ని ఒక ముఖ్యమైన మిత్రదేశంగా చూస్తుంది. కనుక ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన అంతరం అమెరికా, భారతదేశం మధ్య ఇంతవరకు కనిపించని సహకారాన్ని మీరు చూస్తారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌లో వివాదం ఎందుకు?

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తరువాత మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై హింస పెరిగిపోతోంది. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. గత నెల అక్టోబర్ 25 న చిన్మోయ్ దాస్‌తో సహా 19 మంది హిందువులు తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ చిట్టగాంగ్‌లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆరోపించారు.

ఇదే కేసులో హిందూ సాధువు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలు చేస్తూ నవంబర్ 25న అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. జైలుకు పంపింది. ఆ తర్వాత చిన్మయ్ దాస్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలకు దిగారు.

బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేసి బెయిల్ మంజూరు చేయకపోవడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద మూలాలు ఉన్నవారు హిందువులు, ఇతర మైనారిటీలను నిరంతరం లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీని కారణంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, వారి హక్కుల పరిరక్షణ గురించి ఆందోళన పెరుగుతోంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..