యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ మృతి.. స్పానిష్ జైల్లో ఆత్మహత్య …?

ఎన్ సెంట్రిక్ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ మెక్ ఎఫీ బార్సిలోనా (స్స్పెయిన్ ) లోని జైల్లో విగత జీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొనేందుకు

యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ మృతి.. స్పానిష్ జైల్లో ఆత్మహత్య ...?
John Mca Fee Found Dead In Spanish Jail
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 24, 2021 | 11:33 AM

ఎన్ సెంట్రిక్ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జాన్ మెక్ ఎఫీ బార్సిలోనా (స్స్పెయిన్ ) లోని జైల్లో విగత జీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొనేందుకు ఆయనను అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ లోని నేషనల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రూలింగ్ ఇచ్చిన కొద్ధి సేపటికే 75 ఏళ్ళ జాన్ మరణించారని స్పానిష్ పత్రికలు వెల్లడించాయి. ఆయన ఉరి వేసుకుని మరణించారని ఈ పత్రికలు పేర్కొన్నాయి. ఆయనను బతికించడానికి చేసిన యత్నాలు ఫలించలేదు. తమ క్లయింటు మృతి పట్ల అమెరికా, స్పెయిన్ దేశాల్లోని ఆయన తరఫు లాయర్లు విచారం వ్యక్తం చేశారు. నిజానికి తన అప్పగింతను సవాలు చేస్తూ అయన అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉందని వారన్నారు. తనకు జైలు శిక్ష విధించడాన్ని తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని ఆయన తరఫు లాయర్లు పేర్కొన్నారు.

పన్ను ఎగవేశారన్న ఆరోపణపై జాన్ ని గత అక్టోబరులో బార్సిలోనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆయనపై వచ్చిన అభియోగాలు నిజమని తేలితే 30 ఏళ్ళ జైలు శిక్ష విధించేవారు. కాగా జైల్లో తాను ఉరి వేసుకుంటే అది తన తప్పు కాదని జాన్ అప్పట్లోనే ట్వీట్ చేశారు. క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేయడం ద్వారా తన జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులను ఓ డాక్యుమెంటరీకి అమ్మడం ద్వారా ఆయన లక్షల డాలర్లను ఆర్జించారు. 2014 నుంచి 2018 వరకు ఆయన తన టాక్స్ రిటర్నులు చెల్లించలేదు క్రిప్టో కరెన్సీ రెకమెండేషన్లను తప్పుదారి పట్టించి 23 మిలియన్ డాలర్లను ఆర్జించారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ మిషన్ లోగడ ఆయనపై దావా వేసింది. 1994 లో జాన్ ఎపోనిమస్ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కంపెనీ కి రాజీనామా చేశారు. ఏడేళ్ల పాటు ఈ సంస్థలో కొనసాగారు. యూజర్లు సాఫ్ట్ వేర్ ని ఎలా అన్-ఇన్ స్టాల్ చేయవచ్చో 2013 లోనే ఆయన ప్రోఫెన్ ప్యారడీ వీడియోను రూపొందించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.

మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.

Viral Video : పెళ్లిమండపంలో వరుడికి రీడింగ్‌ టెస్ట్‌ పెట్టిన వధువు..పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.

కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.