క్లైమేట్ ఛేంజ్ పై మెగా సమ్మిట్, 40 మంది ప్రపంచ నేతలకు అమెరికా అధ్యక్షుని ఆహ్వానం, మోదీకి కూడా !

ప్రపంచ వాతావరణ  కాలుష్య నిరోధానికి, నివారణకు  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్వహించే భారీ సమ్మిట్ కి  40 మంది ప్రపంచ నాయకులను ఆహ్వానించారు.

  • Umakanth Rao
  • Publish Date - 2:21 pm, Sat, 27 March 21
క్లైమేట్ ఛేంజ్ పై మెగా సమ్మిట్, 40 మంది ప్రపంచ నేతలకు అమెరికా అధ్యక్షుని ఆహ్వానం, మోదీకి కూడా !
we will help you says us president joe biden to india

ప్రపంచ వాతావరణ  కాలుష్య నిరోధానికి, నివారణకు  అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్వహించే భారీ సమ్మిట్ కి  40 మంది ప్రపంచ నాయకులను ఆహ్వానించారు. ప్రధాని మోదీతో బాటు చైనా, రష్యా అధ్యక్షులు జీ జిన్ పింగ్, వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని యొషిహిడె సుగా ,  యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్   అధ్యక్షుడు  జైర్ బొల్సనారో   తదితరులున్నారు. ఏప్రిల్ 22-23 తేదీల్లో రెండు రోజులపాటు వర్చ్యువల్ గా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తారని, పబ్లిక్ చూసేందుకు వీలుగా దీన్ని లైవ్ గా ప్రసారం చేస్తారని తెలుస్తోంది. క్లైమేట్ ఛేంజ్ పై ఐక్యరాష్జ్యసమితి ఆధ్వర్యాన  గ్లాస్గో లో నవంబరులో జరిగే సమ్మిట్ కి  సన్నాహక  సూచనగా ఈ సమ్మిట్ జరగనుంది. దక్షిణాసియా నుంచి ఇంకా భూటాన్, బంగ్లాదేశ్ అధినేతలు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను 1. 5 డిగ్రీల సెల్సియస్ కి పరిమితం చేయాలన్న లక్ష్య సాధనకు చేయాల్సిన కృషి గురించి ఇందులో చర్చించనున్నారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వాలు తీసుకుంటున్న, లేదా తీసుకోబోయే చర్యలను ప్రపంఛాది నేతలు ఈ సమ్మిట్ లో జోబైడెన్ కి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే బైడెన్ సైతం వాతావరణ కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం చేసే కృషిని కూడా వివరిస్తారు. అయితే స్వీడిష్ బాలిక గ్రెటా థన్ బెర్గ్ గురించి మాత్రం బైడెన్ విస్మరించినట్టు ఉన్నారు. క్లైమేట్ చేంజ్ పై ఈ యువతి  ఇప్పటికే పలు దేశాలను అప్రమత్తం చేస్తూ వస్తోంది. మానవాళి మనుగడకు కాలుష్య నివారణ ఒక్కటే మార్గమని ఈమె చాటి చెబుతోంది.  క్లైమేట్  చేంజ్ పై గత  ఏడాది అమెరికాలో జరిగిన  మీటింగ్ కి  గ్రెటా థన్ బెర్గ్ కూడా హాజరైంది. చిన్న వయస్సులోనే వాతావరణ పరిరక్షణకు ఈమె నడుం బిగించింది. అయితే బైడెన్ సహజంగానే ప్రపంచ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.   గనుక థన్ బెర్గ్ ని దూరంగా ఉంచినట్టు భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.
బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.