చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి రెండు దేశాలు అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ.. రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. భారత్ దాడులు జరిపిన బాలకోట్‌లోని భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించిన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాలను రాయిటర్స్ ఏజెన్సీ బయటకు విడుదల చేసింది. ఆ చిత్రాలను చూస్తే బాల్‌కోట్‌ మీద బాంబులు పడ్డాయని […]

చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 5:03 PM

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి రెండు దేశాలు అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ.. రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. భారత్ దాడులు జరిపిన బాలకోట్‌లోని భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించిన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాలను రాయిటర్స్ ఏజెన్సీ బయటకు విడుదల చేసింది. ఆ చిత్రాలను చూస్తే బాల్‌కోట్‌ మీద బాంబులు పడ్డాయని చెప్పడానికి ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

దీంతో భారత్ దాడులపై అందరికీ అనుమానం వచ్చేలా చేసిన ఈ ఏజెన్సీ తాజాగా దాడులు జరిగిన ప్రదేశానికి సంబంధించి మరిన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలను భారత మిస్సైల్స్ కిందపడ్డ 100మీటర్ల దూరం నుంచి తీసినట్లు చెప్పుకొచ్చింది ఈ ఏజెన్సీ. బాల్‌కోట్ స్థావరాలపై దాడి జరిగిన దాఖలు అక్కడ తమకు అసలు కనిపించలేదని, కొండ మీద ఉన్న చెట్లు సహా అక్కడ భవనం చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు అక్కడి స్థానికులతో కూడా తాము మాట్లాడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారత్ దాడులు చేసినట్లు చెప్తున్న ఆ మదర్సాను గతేడాదే మూసివేశారని, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని వారు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే దాడులు జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు తమకు అనుమతిని ఇవ్వలేదని ఆ ఏజెన్సీ రిపోర్టర్ తెలిపారు.

ఇక భారత్ దాడులపై ఓ పాక్ సైనికుడు మాట్లాడుతూ.. భారత్ 300మందిని చంపాం అంటోంది. కానీ ఇక్కడ ఉన్న 300 చెట్లకు కూడా ఎలాంటి హాని జరగలేదని అన్నారు. దేవుడి దయ వలన భారత్ చేసిన దాడుల్లో బాలకోట్‌లో నివాసం ఉంటోన్న ఐదారు కుటుంబాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సైనికుడు చెప్పుకొచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది.

అయితే పుల్వామాలో 42మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ఖండిస్తూ ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 300మంది ఉగ్రవాదులు మరణించినట్లు కొందరు చెబుతున్నా.. ఇరు దేశ ప్రభుత్వాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ క్రమంలో విడులైన శాటిలైట్ ఫొటోలు ఘటనపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ ఫొటోలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దాడులు జరిగాయా..? జరిగితే ఎంతమంది మరణించారు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..