Jackie Chan: మనసులో మాట చెప్పేసిన జాకీ చాన్‌.. కమ్యూనిస్టు పార్టీలో చేరాలని ఉందంటూ…

Jackie Chan: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్న జాకీ చాన్‌ తాజాగా తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనాలో (సీపీసీ) చేరాలని ఉందని చెప్పుకొచ్చారు....

Jackie Chan: మనసులో మాట చెప్పేసిన జాకీ చాన్‌.. కమ్యూనిస్టు పార్టీలో చేరాలని ఉందంటూ...
Jackie Chan
Follow us

|

Updated on: Jul 13, 2021 | 12:17 PM

Jackie Chan: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్న జాకీ చాన్‌ తాజాగా తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనాలో (సీపీసీ) చేరాలని ఉందని చెప్పుకొచ్చారు. జులై 1న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై జులై 6న దేశ సినీ ప్రముఖులు ఓ చర్చా కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే జాకీచాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. ఈ చర్చలో జాకీచాన్‌ మాట్లాడుతూ. ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా గొప్పతనం కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ పార్టీ ఏది చెప్పినా కచ్చితంగా చేస్తుంది. కేవలం కొన్ని దశాబ్దాల కాలంలోనే సాధ్యం చేసి చూపించింది. నేను సీపీసీలో సభ్యుణ్ని కావాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారని గ్లోబల్ టైమ్స్‌ తెలిపింది. ఇదిలా ఉంటే జాకీచాన్‌ ప్రస్తుతం హాంకాంగ్‌లో నివనిస్తున్నారు. గతంలో హాంకాంగ్‌లో చెలరేగి ప్రజాస్వామ్యవాదుల నిరసనలను అణిచిచేయడానికి సీపీసీ తీసుకున్న చర్యలను జాకీచాన్‌ సమర్థించారు. ఆ సమయంలో జాకీచాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇక తనదైన యాక్షన్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రపంచానికి పరియం చేశారు జాకీచాన్‌. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో జాకీచాన్‌ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న జాకీ చాన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్‌ 7న 67వ పడిలోకి అడుగు పెట్టారు జాకీచాన్‌. ఈ సందర్భంగా తన శిష్యులతో కలిసి దిగిన ఓ గ్రూప్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్‌ అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: GoldFish: సరస్సులను నాశనం చేస్తున్న గోల్డ్ ఫిష్.. వాటిని చెరువులలో వదలవద్దని అధికారుల వేడికోలు!

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

US Heatwave: నిప్పుల కొలిమిలా కాలిఫోర్నియా.. వేడి గాలులు, వడగాడ్పులతో అమెరికా సతమతం..

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..