‘అలీబాబా’కు జాక్‌ మా గుడ్‌బై!

ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్‌ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ […]

'అలీబాబా'కు జాక్‌ మా గుడ్‌బై!
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 1:38 PM

ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్‌ దిగ్గజం ‘అలీబాబా’ సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌లో సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. జాక్‌ స్థానంలో సంస్థ  సీఈవో డేనియల్‌ జాంగ్‌ కొత్త చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు.ఇంగ్లిష్ టీచర్‌ అయిన జాక్‌ మా 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈవో పదవి నుంచి జాక్‌ మా తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన నేడు ఆ హోదా నుంచి వైదొలిగారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దిన జాక్ మా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య వేగంగా మారుతున్న పరిణామాలు, అనిశ్చితినెదుర్కొంటున్న తరుణంలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.

కాగా 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్‌ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే  కేటాయిస్తానని పేర్కొన్నారు. నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం  ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాను – ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు, నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక​ బహిరంగ  లేఖ ద్వారా తన రిటైర్‌మెంట్‌ గురించి జాక్‌ మా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ వ్యాపారాలు 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో 66 శాతం వాటాను కలిగి ఉంది అలీ బాబా సంస్థ.

[svt-event date=”10/09/2019,1:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!