Ivana Trump: డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి.. మెట్ల దగ్గర అనుమానస్పద రీతిలో..

Ivana Trump: ఇవానా ట్రంప్ వయస్సు 73 సంవత్సరాలు. చెక‌స్లోవేకియాకు చెందిన మాజీ మోడ‌ల్ అయిన ఇవానాను డొనాల్డ్ ట్రంప్ 1977లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

Ivana Trump: డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మృతి.. మెట్ల దగ్గర అనుమానస్పద రీతిలో..
Ivana Trump
Follow us

|

Updated on: Jul 15, 2022 | 1:46 PM

Donald Trump’s First Wife Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (Ivana Trump) కన్నుమూశారు. న్యూయార్క్ నగరం మాన్‌హాటన్ తన ఇంట్లో ఆమె మరణించినట్లు కుటుంబం ప్రకటించింది. అయితే, ఇవానా ట్రంప్ తన ఇంట్లోని మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఇవానా వయసు 73 సంవత్సరాలు. చెక‌స్లోవేకియాకు చెందిన మాజీ మోడ‌ల్ అయిన ఇవానాను డొనాల్డ్ ట్రంప్ 1977లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్‌. 1992లో వీరు తమ 15 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకున్నారు. కాగా, ఇవానా ట్రంప్ తన ఇంట్లోని మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో కనిపించడంతో.. ఆమె ప్రమాదవశాత్తు మరణించారా..? లేక మరేదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవానా ట్రంప్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా. 1980వ దశకంలో మీడియాలో ట్రంప్ క్రేజ్ పెరగడానికి ఇవానా కూడా కారణం. మారియా మేపుల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ ఎఫైర్ బహిరంగం అయిన తర్వాత వీరిద్దరు వీడిపోయారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మారియా మేపుల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారి దాంప‌త్యం 1999 వ‌ర‌కు సాగింది. ఆ త‌ర్వాత 2005లో మెలానియా ట్రంప్‌ను డోనాల్డ్ పెళ్లి చేసుకున్నారు.

ట్రంప్ విచారం.. 

ఇవి కూడా చదవండి

ఇవానా ట్రంప్ మృతి పట్ల.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తంచేశారు. న్యూయార్క్ సిటీలోని త‌న ఇంట్లో ఇవానా ట్రంప్ మృతిచెందిన‌ట్లు డోనాల్డ్ ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆమె ఓ అద్భుత‌మైన‌, అంద‌మైన మ‌హిళ అంటూ.. ఆమెతో గ‌డిపిన‌ క్షణాలను డోనాల్డ్ ట్రంప్ గుర్తుచేసుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..