Israel Airstrike: చెప్పి మరీ హిజ్బుల్లా స్థానాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 100 మంది మృతి, 400 మందికి గాయాలు

|

Sep 23, 2024 | 6:58 PM

లెబనాన్ స్థానిక మీడియా బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్‌లైన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు నివేదించింది. ఇందులో వైమానిక దాడి జరగక ముందే భవనాలను ఖాళీ చేయాలని కోరింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని డజన్ల కొద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మజ్దాల్ సేలం, హులా, తౌరా, క్లయిలే, హారిస్, నబీ చిట్, హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది.

Israel Airstrike: చెప్పి మరీ హిజ్బుల్లా స్థానాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 100 మంది మృతి, 400 మందికి గాయాలు
Israel Hezbollah Conflict
Image Credit source: AP/PTI
Follow us on

లెబనాన్‌లోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ప్రాంతాల్లో హిజ్బుల్లాకి చెందిన 300 స్థానాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల విషయంపై అల్-జజీరా నివేదిక ప్రకారం ఈ దాడుల్లో కనీసం 100 మంది మరణించారని, 400 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని సందేశం జారీ చేసింది. లెబనాన్ స్థానిక మీడియా బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను ల్యాండ్‌లైన్ కాల్ సందేశాల ద్వారా హెచ్చరించినట్లు నివేదించింది. ఇందులో వైమానిక దాడి జరగక ముందే భవనాలను ఖాళీ చేయాలని కోరింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని డజన్ల కొద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మజ్దాల్ సేలం, హులా, తౌరా, క్లయిలే, హారిస్, నబీ చిట్, హర్బాటా సహా పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది.

చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు – లెబనాన్

లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన వారిలో మహిళలు, పిల్లలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ దాడులలో కనీసం 100 మంది మరణించారు, సుమారు 400 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హిజ్బుల్లా 300 స్థానాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్

మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ బెకా వ్యాలీలో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఆ ప్రాంతంలోని ప్రజలు ఖాళీ చేయమని ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. గ్రౌండ్ మిలిటరీ ఆపరేషన్ గురించి డేనియల్ హగారిని అడిగినప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్‌లో వైమానిక దాడులు ప్రారంభించిందని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున దాడి చేయబోతున్నందున లెబనాన్ ప్రజలు తమ భద్రత కోసం తాము హెచ్చరించిన ప్రాంతాలను ఖాళీ చేయాలని హగారి సూచించారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసం భవనాలు

Israel Hezbollah Conflict 1

ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య పెరిగిన ఉద్రిక్తత

గత వారం సెప్టెంబర్ 17, 18 తేదీలలో లెబనాన్‌లో పేజర్, వాకీ-టాకీ పేలుళ్ల తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆదివారం హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నైస్ కస్సామ్ కూడా తమ యోధులు.. ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారని.. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందని చెప్పారు.

వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య దాదాపుగా ఒక సంవత్సరం పాటు కొనసాగుతున్న యుద్ధం మధ్య, హిజ్బుల్లా ఇజ్రాయెల్ కి చెందిన ఉత్తర ప్రాంతంపై నిరంతరం దాడి చేస్తోంది. ఈ దాడుల కారణంగా సుమారు 60 వేల మంది యూదులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ప్రజలకు పునరావాసం కల్పిస్తామని ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..