పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదుల మారణహోమం.. రెండు గ్రామాలపై దాడి.. 100 మంది మృతి

మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడికి తెగపడ్డారు ఉగ్రవాదులు. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు.

పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదుల మారణహోమం.. రెండు గ్రామాలపై దాడి.. 100 మంది మృతి
Follow us

|

Updated on: Jan 04, 2021 | 5:59 PM

Islamic extremists Attacks: పశ్చిమాఫ్రికాలో టెర్రరిస్టులు మరోసారి మరణహోమం సృష్టించారు. నైజర్‌ దేశంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. మాలి సరిహద్దు వద్ద రెండు గ్రామాలపై దాడికి తెగపడ్డారు ఉగ్రవాదులు. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై నైజర్‌ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి జరిగిన తోచబంగౌ‌, జారౌమ్‌దారే గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు సానుభూతి తెలియజేశారు.

శనివారం తమపై దౌర్జన్యం చేస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. ప్రతికారేచ్ఛతో రగిలిపోయిన ఉగ్రవాదులు రెండు గ్రామాలపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణ హోమంలో వంద మందికి పైగా స్థానికులు ప్రాణాలను కోల్పోయారు. వందలాది మంది గాయాలతో క్షతగాత్రులుగా మిగిలారు. అలస్యంగా తేరుకున్న రక్షణ సిబ్బంది బాధితులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోకోహారమ్‌ గ్రూపునకు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.