నేను బతికే ఉన్నా :ఐసిస్ చీఫ్ అబూ బకర్..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీప్ అబూ బకర్ అల్ బాగ్దాది బతికే ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అతను ఒక వీడియోలో కనిపించాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్‌ సంస్థను 2014లో అక్కడి సైన్యం తరిమికొట్టింది. అప్పుడు జరిగిన బాంబు దాడులలో అబూ బకర్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ కనిపించకుండా పోయిన వ్యక్తి తాజాగా ప్రత్యక్షమైన ఈ వీడియోలో దర్శనమిచ్చాడు. ఒక గదిలో ప్రశాంతంగా కుర్చున్న అబూ బకర్ […]

నేను బతికే ఉన్నా :ఐసిస్ చీఫ్ అబూ బకర్..
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 12:48 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీప్ అబూ బకర్ అల్ బాగ్దాది బతికే ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అతను ఒక వీడియోలో కనిపించాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్‌ సంస్థను 2014లో అక్కడి సైన్యం తరిమికొట్టింది. అప్పుడు జరిగిన బాంబు దాడులలో అబూ బకర్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ కనిపించకుండా పోయిన వ్యక్తి తాజాగా ప్రత్యక్షమైన ఈ వీడియోలో దర్శనమిచ్చాడు.

ఒక గదిలో ప్రశాంతంగా కుర్చున్న అబూ బకర్ ఇటీవల శ్రీలంకలోని చర్చిలు, హోటళ్ల దాడులు, ఆత్మాహుతి దాడులపై మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఐసిస్ ఉగ్రవాద సంస్థలో ఉన్న వారిని అభినందించాడు. శ్రీలంకలో జరిగిన మారణకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న అబూ బకర్ శ్రీలంక పేలుళ్ల తర్వాత వీడియోలో కనిపించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా.. ఈ వీడియోలో అబూ బకర్ కేవలం 40 సెకన్ల పాటు మాత్రమే మాట్లాడాడు. ఇస్లాం మతం కోసం తమ పోరాటం కొనసాగుతుందని.. ఇస్లాములపై దాడులకు, హింసాత్మక చర్యలకు మూల్యం తప్పదని వీడియోలో హెచ్చరించాడు. అయితే.. ప్రస్తుతం ఈయన ఏ దేశంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.