భారత్ హిందువులకే దేశమా? పాక్ ప్రధాని ఇమ్రాన్

కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భారత్‌ను దోషిగా నిలపాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయన పాక్ దేశ ప్రజలనుద్దేశించి ఓ ప్రకటన చేశారు. కశ్మీర్ ప్రజల విషయంలో తాము ఉన్నామని, అక్కడి ప్రజలు పరిస్థితిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న అంశాల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితిదే బాధ్య‌త అని, కశ్మీరీల అంశం యూఎన్ ముందుకు వస్తుందో లేదా వేచి చూడాలన్నారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి మోదీ చ‌రిత్రాత్మ‌క త‌ప్పిదం చేశార‌ని ఇమ్రాన్ […]

భారత్ హిందువులకే దేశమా?  పాక్ ప్రధాని ఇమ్రాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 26, 2019 | 8:04 PM

కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భారత్‌ను దోషిగా నిలపాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆయన పాక్ దేశ ప్రజలనుద్దేశించి ఓ ప్రకటన చేశారు. కశ్మీర్ ప్రజల విషయంలో తాము ఉన్నామని, అక్కడి ప్రజలు పరిస్థితిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న అంశాల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితిదే బాధ్య‌త అని, కశ్మీరీల అంశం యూఎన్ ముందుకు వస్తుందో లేదా వేచి చూడాలన్నారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి మోదీ చ‌రిత్రాత్మ‌క త‌ప్పిదం చేశార‌ని ఇమ్రాన్ అన్నారు. ఎఫ్ఏటీఎఫ్‌లో పాక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందన్నారు ఇమ్రాన్.

భారత్ కేవలం హిందువులకేనా? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టిందని, శాంతి చర్చలకు ఎందుకు భారత్ ముందుకు రావడంలేదో చెప్పాలన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ.. భారత్‌ను హిందువులకే అనే ఆలోచనతో ఉందని మండిపడ్డారు. ఇరు దేశాల్లో విద్య, ఆర్ధిక మాంద్యం, ఆరోగ్యం, వాతావరణం వంటి సమస్యలున్నాయని.. ముందు వాటి గురించి ఆలోచించాలన్నారు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున కశ్మీర్ అంశంలో సూపర్ పవర్ దేశాల బాధ్యత ఎక్కువగా ఉంటుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

భారత ప్రధాని మోదీ ప్యారిస్‌లో జీ7 దేశాల భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఇలా మాట్లాడారు.