Anti-Hijab Protests: ఇరాన్‌లో దారుణం.. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో జుట్టును కట్‌ చేసుకున్న యువతి కాల్చివేత

చాలా మంది న్యాయం కావాలంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాకుండా రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఇక వినూత్న రీతిలో కూడా నిరసనలు..

Anti-Hijab Protests: ఇరాన్‌లో దారుణం.. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో జుట్టును కట్‌ చేసుకున్న యువతి కాల్చివేత
Iran Woman
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Sep 28, 2022 | 3:17 PM

చాలా మంది న్యాయం కావాలంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాకుండా రోడ్డుపై బైఠాయించి కూడా నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఇక వినూత్న రీతిలో కూడా నిరసనలు తెలుపుతుంటారు. కానీ ఇరాన్‌లో ఎవరూ చేయని రీతిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కొందరు మహిళలు. స్త్రీలు ఎంతో ఇష్టంగా పెంచుకునే జట్టు కత్తిరించుకుని మంటల్లో వేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. హిజాబ్‌ వ్యతిరేక నినాదాలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది.

1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత ఇరాన్‌లో చట్టం ప్రకారం మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌ ధరించాలి. ఈ విధానం ఎక్కువ జనాదరణ పొందలేదు. ఇరానియన్‌ మహిళలు సాధారణంగా తలకు స్కార్ఫ్‌ను తమ చెవులను చుట్టూ వదులుగా ధరించడం లేదా మెడపైకి చుట్టేయడం వంటివి చేస్తుంటారు. 1981లో ఈ నియమం అమలు చేయబడినప్పుడు అది సామూహిక ప్రదర్శనను ప్రేరేపించింది. గత వారం ఇరాన్‌లో నిరసనలు చెలరేగడంతో దాదాపు 75 మంది మరణించారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం భద్రతా దళాలు ప్రదర్శనకారులను హింసాత్మకంగా అణచివేయడం, కొన్ని సందర్భాలలో ప్రత్యక్ష మందుగుండు సామాగ్రిని ఉపయోగించడం వల్ల జరిగిందని ఆరోపిస్తున్నారు. వందలాది మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు యూరోన్యూస్‌ నివేదించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

హిజాబ్‌ ధరించనందుకు ఇరాన్‌లో మహస అమీని (22) అనే యువతిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత సెప్టెంబర్‌ 16న ఆమె మరణించింది. పోలీసులు హింసించడంతోనే యువతి మరణించిందని ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంపై మహిళలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకు చాలా 75 మందికిపైగా నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మహిళలకు ఇతర దేశాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

ఇరానియన్‌ యువతి హదీస్‌ నజాఫీ తన జుట్టును కట్‌ చేసుకుని నిరసన తెలుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆమె ఇరాన్ భద్రతా దళాల కాల్పుల్లో మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమె శరీరంగా ఆరు బుల్లెట్ గాయాలున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బహిరంగంగా సవాలు చేయకపోవడంపై విమర్శలు వచ్చినప్పటికీ, ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు అమినీని హత్య చేయడాన్ని UK ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నిర్బంధ హిజాబ్ వంటి ఇరాన్ యొక్క అనేక విధానాలు ఇరానియన్ జనాభాలోని పెద్ద వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందలేదు. ఆర్థిక సమస్యలు, ప్రత్యేకించి ద్రవ్యోల్బణం, ఆంక్షల ద్వారా ఆజ్యం పోసిన భారీ కరెన్సీ, వారి నిరాశను మాత్రమే పెంచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu