బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తూ.. 272 మంది ఎన్నికల సిబ్బంది మృత్యువాత

ఇండోనేషియాలో పది రోజుల క్రితం జరిగిన ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 260 మిలియన్ల మంది ఆ ఎన్నికల్లో భాగస్వాములవగా ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. 193 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒక్కో […]

బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తూ.. 272 మంది ఎన్నికల సిబ్బంది మృత్యువాత
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2019 | 10:04 PM

ఇండోనేషియాలో పది రోజుల క్రితం జరిగిన ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 260 మిలియన్ల మంది ఆ ఎన్నికల్లో భాగస్వాములవగా ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగగా 80 శాతం ఓటింగ్ నమోదైంది. 193 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఒక్కో ఓటరూ ఐదు బ్యాలెట్ పేపర్లపై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం సక్సెస్ అయింది.

అయితే లెక్కింపులో మాత్రం ఫెయిల్ అయింది. ఆ ఎన్నికల కౌంటింగ్ లో 272 మంది ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో గంటల తరబడి లెక్కించడంతో అలసటకు గురై పలు రోగాల బారినపడి వీరంతా మృతి చెందినట్టు ఆదివారం ఓ అధికారి తెలిపారు. మరో 1,878 మంది అనారోగ్యం బారిన పడగా వీరందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇండొనేసియా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి బాగా పెంచడం వల్ల, వారి చేత ఎక్కువ గంటలు పనిచేయించడం వల్లే ఇలా జరిగిందని అక్కడి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. షెడ్యూల్‌ ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తిచేసి మే 22 నాటికి దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వం పనిచేస్తుంది. చనిపోయిన వారికి పరిహారంతో పాటు కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.