ఇండియాపై వాల్ మార్ట్ ఫిర్యాదు.. వ్యాపారం దెబ్బ తింటోందని గగ్గోలు

భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన […]

ఇండియాపై వాల్ మార్ట్ ఫిర్యాదు.. వ్యాపారం దెబ్బ తింటోందని గగ్గోలు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 1:19 PM

భారత్-అమెరికా దేశాల మధ్య టారిఫ్ వార్ ఓ వైపు సాగుతుండగా..దీనికి ఆజ్యం పోస్తూ.. యుఎస్ లోని మల్టీనేషనల్ రిటెయిల్ కార్పొరేషన్..వాల్ మార్ట్… ఇండియామీద సరికొత్త ఆరోపణలు చేసింది.. ఈ-కామర్స్ కు సంబంధించి భారత నూతన పెట్టుబడి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని, తమ వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ గత జనవరిలోనే ఈ మేరకు ఫిర్యాదు చేసినప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును రాయిటర్స్ కు అందజేసింది. ఇండియా తన కొత్త టారిఫ్ నిబంధనలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై సుంకాలను పెంచింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భగ్గుమన్నారు. భారత చర్య తమను ఆందోళనకు గురి చేస్తోందని, ఈ-కామర్స్ రెగ్యులేషన్స్ అత్యంత హార్ష్ గా ఉన్నాయని వాల్ మార్ట్ పేర్కొంది. భారత-అమెరికా దేశాలమధ్య ఈ నిబంధనలు కీలకంగా మారిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. గతంలో ఇది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ పై 16 బిలియన్ యుఎస్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ సొమ్ము వాల్డ్ లోనే ఒక సంస్థ మరొక దానిపై ఇన్వెస్ట్ చేసిన అత్యధికమైనదిగా పేర్కొంటున్నారు. రిటెయిల్ మార్కెట్లో వాల్ మార్ట్.. ఇండియాతో మంచి వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. అయితే అమెరికన్ సరుకులపై భారత ప్రభుత్వం సుంకాలను పెంచడంతో దాని ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది.

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా