బాహుబలి ట్రక్… 60 టన్నుల బరువు… ఇండియా లో తయారైన ఎలక్ట్రీక్ ట్రక్…

భారత్ లో బాహుబలి ట్రక్ రూపుదిద్దుకుంది. స్వదేశీ ప‌రిజ్ఞానంతో ఈ ట్రక్ ను డిజైన్ చేసి... ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. 60 టన్నుల బరువు కలిగి ఉన్న ట్రక్ కేవలం రూ.10ల ఖర్చుతో కిలో మీటరు ప్రయాణిస్తుంది.

బాహుబలి ట్రక్... 60 టన్నుల బరువు... ఇండియా లో తయారైన ఎలక్ట్రీక్ ట్రక్...
Follow us

|

Updated on: Nov 27, 2020 | 5:56 PM

భారత్ లో బాహుబలి ట్రక్ రూపుదిద్దుకుంది. స్వదేశీ ప‌రిజ్ఞానంతో ఈ ట్రక్ ను డిజైన్ చేసి ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. 60 టన్నుల బరువు కలిగి ఉన్న ట్రక్ కేవలం రూ.10లతో కిలో మీటరు ప్రయాణిస్తుంది.

గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ ఈ భారీ ట్ర‌క్ ను రూపొందించింది. ఈ ట్రక్ ఎన్నోవిశేషాల‌ను క‌లిగి ఉంది. అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రినో 5536 ట్ర‌క్ మ‌న ఇండియాలోనే రూపుదిద్దుకుంది. రినో ట్ర‌క్ 60 టన్నుల బ‌రువు ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీతో ప‌రుగులు పెడుతుంది. ఇందులో 483 బీహెచ్ పీ ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. అలాగే 276 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది.

అత్యాధునిక ఫీచ‌ర్లు…

సింగిల్ చార్జిపై 200-300 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఫుల్‌లోడ్‌తో సుమారు 300కిలోమీట‌ర్లు, లోడ్ లేకుండా సుమారు 400కిలోమీట‌ర్లు వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 16కేవీ ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో ఈ వాహ‌నం బ్యాట‌రీని కేవ‌లం గంట‌లోనే ఫుల్ చార్జ్ చేయ‌వ‌చ్చు. బ్యాట‌రీ ఉష్ణోగ్ర‌త పెర‌గ‌కుండా ప్ర‌త్యేక కూలింగ్ సిస్టంను ఇందులో అమర్చారు. ఇక ఈ ట్రక్ గ‌రిష్ట‌ వేగం గంటకు 90 కి.మీ. కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి కేవ‌లం రూ.10 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంది. అదే డీజిల్ ట్ర‌క్ అయితే సుమారు రూ.30 అవుతుంది. వాహనం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. సిమెంట్ కంపెనీలు, మైనింగ్ ,కంస్ట్ర‌క్ష‌న్ కంపెనీలో సామాగ్రిని ర‌వాణా చేయ‌డానికి అనువుగా ఈ రినో5536 ట్ర‌క్‌ను రూపొందించారు.

ఈ ఎలక్ట్రిక్ ట్రక్కుల ఉత్పత్తి 2020 జనవరి నుంచి సదరు కంపెనీ ఫరీదాబాద్ ప్లాంట్లో ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి నాటికి 1,000 ఎలక్ట్రిక్ ట్రక్కులను, 2021 నాటికి 10,000 ట్రక్కులను రోడ్డుపైకి తీసుకురావాల‌ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

రినో 5536 ఎల‌క్ట్రిక్ ట్ర‌క్ విశేషాలు…

ట్రక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలో మీటర్లు సింగిల్ చార్జిపై 400 కిలో మీటర్ల ప్ర‌యాణం బ్యాట‌రీ సామ‌ర్థ్యం 276 కిలో వాట్స్ ట్ర‌క్ బ‌రువు 60 టన్నులు మోటార్ ప‌వ‌ర్ ఔట్‌పుట్ 483 బీహెచ్ పీ లాంచ్ ఇయ‌ర్ 2020

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...