కరోనా వేళ.. కదిలొచ్చిన అదృష్ట లక్ష్మి.. ఏకంగా ఎన్ని లక్షల లాటరీ గెలిచాడంటే..!

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో..

  • Tv9 Telugu
  • Publish Date - 8:11 am, Fri, 24 April 20
కరోనా వేళ.. కదిలొచ్చిన అదృష్ట లక్ష్మి.. ఏకంగా ఎన్ని లక్షల లాటరీ గెలిచాడంటే..!

కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో.. చాలామంది ఉపాధిని కోల్పోయారు. దీంతో ఒక్క పూట అన్నం దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ భారతీయుడిని అదృష్ట లక్ష్మి వరించింది. అతడు భారీ లాటరీని గెలిచాడు. దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ లోటో ప్రారంభోత్సవ డ్రాలో అతడు విన్నర్‌గా నిలిచాడు. దీంతో 350,000 దిరామ్ లను ఆయన గెలుచుకున్నారు. అంటే ఇండియన్ రూపాయి ప్రకారం దాదాపు రూ.72 లక్షలు. దీంతో ఇప్పుడు ఆ వ్యక్తి దుబాయ్ లో హాట్ టాపిక్ గా మారారు. తన దగ్గరున్న టికెట్లోని ఆరు నంబర్లు కలవడంతో.. తాను షాక్‌ తిన్నట్లు మహమ్మద్ ఖలీద్ అన్నారు.

కాగా పదేళ్ల క్రితం దుబాయ్‌కు వెళ్లిన ఆ వ్యక్తి.. ప్రస్తుతం అక్కడ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇక ప్రైజ్‌ మనీ వచ్చిన తరువాత ఆ వ్యక్తి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని తన కుటుంబానికి పంచారు. అంతేకాదు యూఏఈ వైస్‌ ప్రెసిడంట్, ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు 10 మిలియన్ రమదాన్ మీల్స్‌ కార్యక్రమానికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పి, పెద్ద మనసుకు చాటుకున్నారు.

Read This Story Also: మంత్రికి కరోనా పాజిటివ్..!