గ్లోబల్ హీట్ ముప్పు.. డేంజర్ జోన్ లో ఇండియా

గ్లోబల్ హీట్ ముప్పు.. డేంజర్ జోన్ లో ఇండియా

గ్లోబల్ హీట్.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న వాతావరణ సంబంధమైన డేంజర్ ఇది.. పర్యావరణం దెబ్బ తింటూ.. కాలుష్య భూతం ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న వేళ.. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఈ ప్రమాద సంకేతాలకు ఇండియా కూడా చేరువలోనే ఉందట. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ, మడగాస్కర్ తరువాత భారత్ ఐదో స్థానంలో ఉందని ‘ జర్మన్ వాచ్ ‘ అనే సంస్థ.. ‘ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2020 ‘ పేరిట విడుదల చేసిన నివేదికలో […]

Pardhasaradhi Peri

|

Dec 05, 2019 | 7:33 PM

గ్లోబల్ హీట్.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న వాతావరణ సంబంధమైన డేంజర్ ఇది.. పర్యావరణం దెబ్బ తింటూ.. కాలుష్య భూతం ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న వేళ.. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఈ ప్రమాద సంకేతాలకు ఇండియా కూడా చేరువలోనే ఉందట. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ, మడగాస్కర్ తరువాత భారత్ ఐదో స్థానంలో ఉందని ‘ జర్మన్ వాచ్ ‘ అనే సంస్థ.. ‘ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2020 ‘ పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఈ సంస్థ 181 దేశాల్లోని వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసింది. గ్లోబల్ హీట్ పెరుగుతున్న కారణంగా అనేక దేశాల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఈ రిపోర్టు వెల్లడించింది.’ గత ఏడాది ఇండియాలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేకమంది మృత్యువాత పడ్డారు.. అలాగే భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఉదాహరణకు నిరుడు నైరుతి రుతుపవనాల “ఉత్పాతం” కారణంగా కేరళలో కొండచరియలు విరిగి పడి సుమారు 324 మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేకమంది సజీవ సమాధి అయ్యారు ‘ అని ఈ నివేదిక గుర్తు చేసింది.

భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాన్ని కుదిపేశాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని, 80 డ్యామ్ లు దెబ్బ తిన్నాయని,2. 3 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. తిత్లీ, గజ వంటి తుపానులు గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పెను నష్టాలను కలిగించినట్టు తెలిపింది. ఇలాగే జపాన్, జర్మనీ, ఫిలిపీన్స్ వంటి దేశాలు కూడా గ్లోబల్ హీట్ ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టు తేల్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu