H-1B Visa Restrictions: హెచ్‌ బీ1 వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను తొలగిస్తా: జో బైడెన్‌

H-1B Visa Restrictions: ఉపాధి ఆధారిత వీసాలతో పాటు గ్రీన్‌ కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ..

H-1B Visa Restrictions: హెచ్‌ బీ1 వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను తొలగిస్తా: జో బైడెన్‌
Follow us

|

Updated on: Jan 08, 2021 | 5:27 AM

H-1B Visa Restrictions: ఉపాధి ఆధారిత వీసాలతో పాటు గ్రీన్‌ కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఇండియన్‌ అమెరికన్‌ వ్యాపారవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీసాల జారీపై ట్రంప్‌ సర్కార్‌ విధించిన ఆంక్షలను సడలించాలని, అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ను తాజాగా కోరారు. సైన్స్‌, మ్యాథమేటిక్స్‌లో పట్టా సాధించిన వారికి గ్రీన్‌ కార్డులను అందించాలని కోరారు. దీనిపై స్పందించిన జో బైడెన్‌.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం హెచ్‌ 1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన ఆంక్షలను తొలగిస్తానని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా యూఎస్‌ -ఇండియా స్టాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ప్రసిడెంట్‌ ముఖేష్‌ మీడియాతో మాట్లాడారు. హెచ్‌ 1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఎస్‌టీఈఎమ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి గ్రీన్‌ కార్డులు మంజూరు చేయాలని జో బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ను కోరాము, పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి గ్రీన్‌ కార్డులు ఇవ్వడం ద్వారా వారు అక్కడే ఉంటారు. వారి సేవలు దేశానికి అందుతాయి. దీని ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుంది అని అన్నారు.

Former Presidents On Washington Incident:చరిత్రలో చీకటి రోజు..ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటున్న మాజీ అధ్యక్షులు