Hurricane Ian: ఇయన్ హరికేన్ విధ్వంసం.. ఫ్లోరిడా విలవిల.. భారీగా ఆస్తినష్టం..

అమెరికాలోని ఫ్లోరిడాను ఇయాన్ హరికేన్ వణికించింది. ఉధృతంగా వీచిన గాలులు, ఎగిపిసడిన అలలు, భారీ వర్షాలు తీర ప్రాంతాలను దెబ్బతీశాయి. సముద్రంలో ఉండాల్సిన షార్కులు, మొసళ్లు నగరంలో ఈదుతూ కనిపించాయి. దీనిని బట్టి ఈ తుఫాను..

Hurricane Ian: ఇయన్ హరికేన్ విధ్వంసం.. ఫ్లోరిడా విలవిల.. భారీగా ఆస్తినష్టం..
Ian Hurricane
Follow us

|

Updated on: Sep 30, 2022 | 10:47 AM

అమెరికాలోని ఫ్లోరిడాను ఇయాన్ హరికేన్ వణికించింది. ఉధృతంగా వీచిన గాలులు, ఎగిపిసడిన అలలు, భారీ వర్షాలు తీర ప్రాంతాలను దెబ్బతీశాయి. సముద్రంలో ఉండాల్సిన షార్కులు, మొసళ్లు నగరంలో ఈదుతూ కనిపించాయి. దీనిని బట్టి ఈ తుఫాను బీభత్సం ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇయన్ హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. 209 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులకు టంపా బే తీరం అల్లకల్లోలంగా మారింది. వృక్షాలు, విద్యుత్‌ స్తంబాలు కూలిపోయాయి. సముద్ర కెరటాలు 18 అడుగుల ఎత్తున ఎగిసిపడుతూ తీరాన్ని బలంగా తాకాయి. ఈ ధాటికి ఓడరేవులో నిలిపి ఉన్న బోట్లు తిరగబడ్డాయి. ఈ దెబ్బకు సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయింది. వీరిలో కొందరిని బోర్డర్ పెట్రోలింగ్ సిబ్బంది రక్షించారు. దాదాపు 23 మంది గల్లంతైపోయాయి. నార్త్‌ పెరీ విమానాశ్రయంతో పాటు డెల్రే బీచ్‌ సమీపంలో పల్టీలు కొట్టిన విమానాలు కనిపించాయి భారీ వర్షాలు కురవడంతో సముద్రం, తీర ప్రాంత జనావాసాలు కలిసిపోయినట్లుగా కనిపించాయి.

నేపుల్స్‌ నగరంలో నడుములోతు నీటిలో కార్లు, ట్రక్కులు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో కనిపించాయి. ఇయాన్‌ తుఫాను దాదాపు లక్షమందిపై ప్రభావం చూపిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇయాన్‌ తుఫాను సృష్టించిన నష్టం అపారంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన హరికేన్‌ ఇదేనని నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ వెల్లడించింది. నైరుతి ఫ్లోరిడా ప్రాంతంలో గంటకి 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీగా కురిసిన వర్షాలకు ఇళ్లు నీట మునిగిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ హరికేన్ సృష్టించిన విధ్వంసంతో టాంపా, ఒర్లాండో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. విద్యుత్‌ లేకపోవడం, సెల్‌ టవర్లు పనిచెయ్యకపోవడంతో సహాయ చర్యలు అందించడం కత్తి మీద సాములా మారిందని అధికారులు చెబుతున్నారు. హరికేన్‌ విధ్వంసం సృష్టించే ప్రాంతాల్ని తిరిగి పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!