హాంకాంగ్ లో రెచ్చిపోయిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!

హాంకాంగ్ లో నిరసనకారులపై పోలీసులు రెచ్చిపోతున్నారు. సోమవారం వీధుల్లోకి వచ్చి.. ప్రదర్శనలకు దిగినవారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నారు. తన వద్దకు దూసుకు వస్తున్న ఓ ఆందోళనకారుడిని అడ్డుకునేందుకు ఓ పోలీసు అధికారి గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి రక్తమోడుతూ తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలాడు. మరొక చోట ఆందోళనకారుల్లో కొందరు ఓ వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో.. మంటల్లో కాలుతూనే ఆ వ్యక్తి పరుగులు తీశాడు. తమపై దాడికి దిగేందుకు […]

హాంకాంగ్ లో రెచ్చిపోయిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2019 | 6:41 PM

హాంకాంగ్ లో నిరసనకారులపై పోలీసులు రెచ్చిపోతున్నారు. సోమవారం వీధుల్లోకి వచ్చి.. ప్రదర్శనలకు దిగినవారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నారు. తన వద్దకు దూసుకు వస్తున్న ఓ ఆందోళనకారుడిని అడ్డుకునేందుకు ఓ పోలీసు అధికారి గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి రక్తమోడుతూ తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలాడు. మరొక చోట ఆందోళనకారుల్లో కొందరు ఓ వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో.. మంటల్లో కాలుతూనే ఆ వ్యక్తి పరుగులు తీశాడు. తమపై దాడికి దిగేందుకు ప్రయత్నించిన నిరసనకారుల్లో కొంతమందిని పోలీసులు పడుకోబెట్టి వారి కాళ్ళు, చేతులు కట్టివేశారు. ఇవన్నీ ఫేస్ బుక్ ఫుటేజీలో లైవ్ గా ‘ బయటకి వస్తూ ‘ దిగ్భ్రాంతి ‘ కలిగిస్తున్నాయి. ఇంకొక చోట వారిని చెదరగొట్టడానికి పోలీసులు అతి వేగంగా వారిపైకి బైక్ లను నడిపిస్తున్న దృశ్యాలను కొన్ని వెబ్ సైట్లు వీడియోలుగా చూపుతున్నాయి. తాము శాంతియుతంగా ప్రదర్శనలు జరుపుతుంటే పోలీసులు ఇంతటి కర్కశ్వత్వానికి దిగుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. హాంకాంగ్ లో వరుసగా 24 వారాలుగా ఇలా హింసాకాండ కొనసాగుతూ ఆ నగరం అట్టుడుకుతోంది.