Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ రికార్డు.. ఎంపీగా ఎన్నిక..!

Australia: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ..

Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ రికార్డు.. ఎంపీగా ఎన్నిక..!
Follow us

|

Updated on: May 23, 2022 | 6:23 PM

Australia: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులుగా కీలక హోదాల్లో వున్నారు. ఇక పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. కెనడా, బ్రిటన్, అమెరికా చట్టసభలలో తమ ఉనికిని చాటుకుంటున్న భారతీయులు. ఇక తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫెడరల్, సెనేట్ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దిగువ సభలోని మొత్తం 151 స్థానాలకు, ఎగువ సభలోని 76 స్థానాలకు గాను 40 స్థానాలకు మే 21న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎంపీగా తొలి భారత సంతతికి చెందిన జానెటా మస్కరెన్హాస్‌ ఎన్నికయ్యారు. వృత్తి రీత్యా ఇంజనీరింగ్‌. అయితే మస్కరెన్హాస్‌ ఆస్ట్రేలియాలో జన్మించారు. కానీ ఆమె తల్లిదండ్రులు గోవాకు చెందిన వారు.

కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఎన్నికైన మస్కరెన్హాస్‌ ఆస్ట్రేలియాలోనే జన్మించారు. ఆమె తన లిబరల్‌ ప్రత్యర్థి క్రిస్టీ మెక్‌స్వీనీని ఓడించారు. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారిగా ఎన్నికల్లో గెలుపొందింది. కాగా, ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్‌ జరిగింది. కరోనా దృష్ట్యా ఆ దేశంలోని 1.70 కోట్ల మంది ఓటర్లలో 48 శాతంకుపైగా ముందస్తు ఓటింగ్‌, పోస్టల్‌ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళ ఎన్నిక కావడం గమనార్హం.

ఆస్ట్రేలియా ఎంపిగా భారత సంతతి మహిళ ఎన్నిక

ఇవి కూడా చదవండి

ఆమె తల్లిదండ్రులు మే 1979లో ఆస్ట్రేలియాకు తరలివెళ్లారు. ఆమె తండ్రి పనిచేసే నికెల్ మైనింగ్ టౌన్ అయిన కంబాల్డాలో స్థిరపడ్డారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన భార్య, ఇద్దరు పిల్లలు లింకన్, ఫెలిసిటీతో కలిసి తూర్పు విక్టోరియా పార్క్‌లో నివసిస్తున్నారు. నా తల్లిదండ్రులు, తాతలు గోవాలో జన్మించారు. భారతీయ పౌరసత్వ చట్టం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. నా తల్లిదండ్రులు 1979లో ఆస్ట్రేలియన్ పౌరులు అయ్యారు. అందుకే వారు ఆస్ట్రేలియన్ పౌరులుగా మారినప్పుడు వారు భారతీయ పౌరసత్వాన్ని కోల్పోయారు అని మస్కరెన్హాస్‌ పేర్కొన్నారు. 2019లో ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికలకు ముందు మస్కరెన్హాస్ ఎన్నికల రాజకీయాలలో తన మొదటి ప్రయత్నం చేసింది. స్వాన్ నియోజకవర్గానికి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. ఆమె తన పార్టీ సహోద్యోగికి అనుకూలంగా ఉపసంహరించుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి