మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. వాషింగ్టన్‌లో తెలుగువారి 5కే రన్.. పరుగులు పెట్టిన భారతీయులు..

NRI News: అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. వందలాది మంది భారతీయ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం...

మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. వాషింగ్టన్‌లో తెలుగువారి 5కే రన్.. పరుగులు పెట్టిన భారతీయులు..
Narender Vaitla

|

Oct 07, 2021 | 2:42 PM

NRI News: అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. వందలాది మంది భారతీయ చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఉదయం 8  గంటల నుండే చిన్నారుల రన్ తో మొదలైన ఈ సందడి కనుల పండుగగా మధ్యాహ్నం వరకూ కొనసాగింది.

కరోనా దశ తర్వాత జరిగిన అతిపెద్ద కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిలిచింది. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న అవగాహన కల్పిస్తూ.. వందలాది మందిని ఒక చోట చేరి, ఎంతో ఉత్సాహంతో కలిసి నడుస్తూ అందరికి ఒక నూతనోత్తేజాన్ని కల్పించింది.

పొద్దున్నే చిన్నారులకు పెద్దలకు అల్పాహారం, కాఫీ అందించి.. మార్గమధ్యంలో వాటర్ అందిస్తూ, పలు జాగ్రత్తలతో వాలంటీర్ల సహకారంతో  కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించటం తెలుగు వారందరు హర్షాన్ని వ్యక్తం చేస్తూ.. అభినందించినట్లు అధ్యక్షురాలు సాయి సుధా పాలడుగు తెలిపారు.

చాలా కాలం తర్వాత ఆరుబయట పార్క్ లో నిర్వహించిన 5K రన్ లో  తానా, ఆటా, టీడీఎఫ్‌తోపాటు పలు ఇతర తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా సంయుక్తంగా పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా సమిష్టి సహకారంతో ఈ వేడుక నిర్వహించటాన్ని కొనియాడారు. తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఆటా కార్యదర్శి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొని తెలుగు వారందరం ఒకటే అని..

అను నిత్యం పలు కార్యక్రమాలతో దూసుకు పోతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు సాయి సుధాను, కార్య వర్గ సభ్యులను అభినందించారు. రన్ తర్వాత జరిగిన జూమ్బా నృత్యమ్ చిన్నారులను, మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కాలు కదిపి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

Also Read: అమ్మాయిలతో ఏశాలేస్తే ఇంతేమరి.. పోకిరీల తాట తీసిన స్థానిక ప్రజలు.. ఎక్కడంటే..

Chanakya Niti: ఇలాంటి వ్యక్తులతో అస్సలు స్నేహం చేయవద్దు.. చేస్తే ఇక అంతే..

Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu