christmas wishes : క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్‌ ట్రీకి ఉన్న సంబంధమేమిటో, క్రిస్మస్‌ చెట్టును ఎందుకు అలంకరిస్తారో తెలుసా?

క్రిస్మస్‌ పండుగ రోజున చర్చిలలో, ఇళ్లల్లో విద్యుద్దీపాల వెలుగులో మనకు ధగధగమనే ఓ చెట్టు కనిపిస్తుంది. అదే క్రిస్మస్‌ చెట్టు. క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్‌ చెట్టుకు ఉన్న సంబంధమేమిటో, ఆ చెట్టును ఎందుకు అలంకరిస్తారో....

christmas wishes : క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్‌ ట్రీకి ఉన్న సంబంధమేమిటో, క్రిస్మస్‌ చెట్టును ఎందుకు అలంకరిస్తారో తెలుసా?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 24, 2020 | 1:22 PM

క్రిస్మస్‌ పండుగ రోజున చర్చిలలో, ఇళ్లల్లో విద్యుద్దీపాల వెలుగులో మనకు ధగధగమనే ఓ చెట్టు కనిపిస్తుంది. అదే క్రిస్మస్‌ చెట్టు. క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్మస్‌ చెట్టుకు ఉన్న సంబంధమేమిటో, ఆ చెట్టును ఎందుకు అలంకరిస్తారో, అసలు ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయ్యిందో చాలా మందికి తెలియదు.. క్రిస్మస్‌ ట్రీ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైన కథ ఒకటుంది.. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో సెయింట్‌ బోనీఫస్‌ సువార్త సేవల కోసం జర్మనీకి వెళ్లారు.. అక్కడ ఆదివాసులు ఓక్‌ చెట్టుకు పూజలు చేసి సంబరాలు జరుపుకోవడాన్ని గమనించారు. ఆ చెట్టును దైవసమానంగా భావిస్తూ నరబలి కూడా ఇచ్చేవారట! ఇది బోనీఫస్‌ను అమితంగా బాధించింది. ఆ దురాచారాన్ని రూపుమాపాలనుకున్నారు. ఆదివాసులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. సదా క్రీస్తువైపుకు దారిని చూపించే ఫర్‌ చెట్టును పూజించాల్సిందిగా వారికి చెప్పారు. మనుషులను పాప విముక్తులను చేయడానికే ఏసు శిలువ ఎక్కారని.. ఆ కారణంగా మీరు నరబలులు ఆపేయాలని ఉపదేశించారు. ఈ చెట్టు కొమ్మలను ఇళ్లకు తీసుకెళ్లి అందంగా అలంకరించి ఆనందంగా పండుగ చేసుకోమని ఆదేశించారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ పండుగ రోజున ఫర్‌ చెట్టును అలంకరించడం ఆనవాయితీగా మారింది.

మరో కథ కూడా ఉంది. అప్పట్లో క్రిస్మస్‌ రోజున చర్చికి వెళ్లి, కానుకలను ఇవ్వడం సంప్రదాయంగా ఉండేది.. ఓ ఊరిలో నివసిస్తున్న ప్లాబో అనే పేదపిల్లోడి దగ్గర కానుకలివ్వడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏంచేయాలో పాలుపోలేదా పిల్లోడికి! ఇంటి ముందున్న ఓ అందమైన మొక్కను చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి వెళతాడు. ప్లాబో తెచ్చిన కానుకను చూసి అందరూ నవ్వుతారు. ప్లాబో సిగ్గుపడుతూనే ఆ మొక్కను క్రీస్తు విగ్రహం దగ్గర పెడతాడు. ఆశ్చర్యంగా అప్పటికప్పుడు ఆ చిన్నమొక్కే పెద్దగా ఎదిగి బంగారు చెట్టుగా మారిపోతుంది. ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు తలలు వంచుకున్నారంతా! కానుకను సహృదయంతో ఇవ్వడమే ప్రధానమని తెలుసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం ఆనవాయితీగా మారింది.క్రిస్మస్‌ చెట్టుకు బోలెడన్ని విశేషాలున్నాయి. క్రిస్మస్‌ పర్వదినాన ఫర్‌ చెట్టును అలంకరించడమే సంప్రదాయం పదో శతాబ్దంలో జర్మనీలో మొదలయ్యింది. 1832లో ప్రొఫెసర్‌ చార్లెస్‌ ఫోలెన్‌ క్రిస్మస్‌ ట్రీని క్యాండిల్‌ దీపాలతో అలంకరించాడు.. విద్యుత్‌దీపాలతో అలంకరించడమన్నది 1882 నుంచి మొదలయ్యింది. యూరప్‌లో ఏడాది సుమారు ఆరు కోట్ల క్రిస్మస్‌ చెట్లను పెంచుతారు. ఇక వీటి కోసం అమెరికావాళ్లు ఏడాదికి 1.8 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారట! దాదాపుగా లక్షమంది ఉద్యోగులు క్రిస్మస్‌ ట్రీ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల ఎకరాల్లో క్రిస్మస్‌ చెట్లను పెంచుతున్నారు. ఎకరానికి రెండు వేల చెట్ల చొప్పున పెంచుతారు. ప్రతి ఏడాది ఎనిమిది కోట్ల చెట్లను నాటుతారు. ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్‌ చెట్టు వెల్లింగ్టన్‌లోని హీల్లన్‌ పార్క్‌లో ఉంది.. 120 చదరపు అడుగులు విస్తరించి ఉన్న ఈ చెట్టు ఎత్తు 91 అడుగులు.. క్రిస్మస్‌ పండుగ రోజున ఈ చెట్టును బంగారు..వెండి ఆభరణాలతో.. విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. అత్యంత విలువైనది అబుదాబిలోని ప్యాలస్‌ హోటల్‌లో ఉంది.. 40 అడుగుల ఎత్తున్న ఆ క్రిస్మట్‌ ట్రీ విలువ కోటి పది లక్షల డాలర్లు… అంటే దాదాపు 75 కోట్ల రూపాయలన్నమాట! అంతుంటుందా? అని ఆశ్చర్యపోకండి.. 181 వజ్రాలు.. పగడాలు.. కెంపులు ఇలా నవరత్నాలతో అలంకరిస్తే ఉండదా మరి! ఇక స్పెయిన్‌లోని కెంపిన్‌స్కీ పట్టణంలో ఉన్న హోటల్‌ బహియాలో ఇంతకంటే విలువైన క్రిస్మస్‌ చెట్టుంది.. 19 అడుగుల ఎత్తున్న ఈ చెట్టులో కెంపులు, రత్నాలు, మాణిక్యాలు, మరకతాలు, వజ్రాలు ఉన్నాయి.. ఈ చెట్టు విలువ 15 మిలియన్‌ డాలర్లు. సాధారణంగా స్కాట్చ్‌, పైన్‌, డగ్లస్‌ఫర్‌, ఫ్రాసర్‌ఫర్‌, బాల్సమ్‌ఫమర్‌, వైట్‌పైన్ మొక్కలను క్రిస్మస్‌ ట్రీలుగా వాడతారు. ఇండియాలో ఫర్‌ చెట్టు లేదు కాబట్టే దగ్గర పోలికలతో ఉన్న సరివి చెట్టును క్రిస్మస్‌ ట్రీగా ఉపయోగిస్తున్నారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్