Nuclear war: అమెరికా – రష్యా మధ్య అణు యుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారో తెలుసా?

నేటి ఆధునిక కాలంలో అమెరికా- రష్యా మధ్య పూర్తిస్ధాయి అణు యుద్ధం జరిగితే తెల్తే పరిణామాల వల్ల దాదాపు 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కారణంగా అణుయుద్ధం సంభవించవచ్చనే..

Nuclear war: అమెరికా - రష్యా మధ్య అణు యుద్ధం వస్తే ఎంతమంది చనిపోతారో తెలుసా?
Nuclear War (file Photo)
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2022 | 10:37 AM

Nuclear war: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతన్న యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే తరహా వాతావరణం కొనసాగితే భవిష్యత్తులో అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధన కీలక అంశాలను వెల్లడించింది. నేటి ఆధునిక కాలంలో అమెరికా- రష్యా మధ్య పూర్తిస్ధాయి అణు యుద్ధం జరిగితే తలెల్తే పరిణామాల వల్ల దాదాపు 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనావేసింది.  రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కారణంగా అణుయుద్ధం సంభవించవచ్చనే అనుమానాల మధ్య తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది.

అమెరికా రష్యా మధ్య పూర్తిస్థాయి అణుయుద్ధం వల్ల సగానికి పైగా మానవాళి తుడుచు పెట్టుకుపోతుందని, పంట ఉత్పత్తి 90 శాతం పడిపోతుందని రట్జర్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. అత్యాధునిక అణుయుద్ధం తలెత్తితే వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాలు, సూర్యకాంతిని నిరోధించే మసి, కరువు కారణంగా కనీసం 500 కోట్ల మంది మరణించవచ్చని ఈ పరిశోధనలో తేలింది. రట్జర్ విశ్వవిద్యాలయంలోని శాస్త్ర వేత్తల బృందం అణుయుద్ధం జరిగేందుకు ఉన్న 6అవకాశాలను విశ్లేషించింది. వీటిలో అమెరికా, రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేలింది. సగానికి పైగా మానవాళి తుడుచుపెట్టుకుపోతుందని వెల్లడించింది. ఈపరిశోధన ఫలితాలను ది జనరల్ నేచుర్ ఫుడ్ లో ప్రచురించింది.

అణ్వాయుధాల ప్రయోగం కారణంగా వాతావరణంలోకి ఎంత మొత్తంలో కర్బన్ ఉద్గారాలు చేరతాయనే దాని ఆధారంగా ఈఅంచనాలు తయారు చేశారు. ఇందుకోసం పరిశోధకులు వాతావరణ అంచనాకు వినియోగించే ప్రత్యేక టూల్స్ ను వినియోగించారు. అలాగే అమెరికా జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సహకారం తీసుకున్నారు. తద్వారా ప్రధానపంటల ఉత్పత్తి దేశాల ఆధారంగా ఎలా ఉండబోతుందని ఈపరిశోధకుల బృందం అంచనా వేసింది. చిన్నస్థాయి సంక్షోభం కూడా ఆహార ఉత్పత్తిపై పెను ప్రభావం చూపుతుందని ఈపరిశోధన వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

భారత్ – పాకిస్తాన్ మధ్య స్థానికంగా జరిగే యుద్ధం కూడా ఐదేళ్ల లోపు 7శాతం పంట ఉత్పత్తులను తగ్గించేస్తుందని ఈపరిశోధనలో తేలింది. .. అమెరికా రష్యా మధ్య ఘర్షణ తలెత్తితే నాలుగేళ్ల కాలంలో 90 శాతం వ్యవసాయ ఉత్తత్తి పడిపోతుందని హెచ్చరించింది. నిత్యవసరాలు తీర్చే పంటలు, ఆహార వృధా కట్టడి , జంతువుల నుంచి లభించే ఆహారం తాత్కలికంగా మాత్రమే ఈప్రభావం నుంచి తప్పించగలదని పేర్కొంది. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా అమెరికా, రష్యాల మధ్య వివాదం తలెత్తిన తర్వాత ఈఅధ్యయనం జరిగింది. భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్ రోవ్ ఈఏడాది ఏప్రియల్ నెలలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..