Pakistan: 33 స్థానాల నుంచి పోటీ.. మాజీ ప్రధాని సంచలన నిర్ణయం.. కారణం ఏంటంటే..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. 33 స్థానాల నుంచి ఆయన ఒక్కరే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పాకిస్తాన్‌..

Pakistan: 33 స్థానాల నుంచి పోటీ.. మాజీ ప్రధాని సంచలన నిర్ణయం.. కారణం ఏంటంటే..
Imran Khan
Follow us

|

Updated on: Jan 30, 2023 | 6:35 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. 33 స్థానాల నుంచి ఆయన ఒక్కరే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో జరగబోయే జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పాకిస్తాన్‌ తెహ్రీక్‌ – ఇ- ఇన్సాఫ్‌ (పీటీఐ) కోర్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వైస్‌ ఛైర్మన్‌ షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. ఉప ఎన్నికలు జరిగే మొత్తం 33 పార్లమెంటరీ స్థానాల నుంచి తమ పార్టీ తరఫున మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక్కరే పోటీ చేస్తారని ఖురేషీ వెల్లడించారు. ముందస్తు ఎన్నికల విషయంలో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 33 స్థానాలకు మార్చి 16 న ఉప ఎన్నిక జరగనుంది.

ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలు పంజాబ్‌ ప్రావిన్స్‌లో 12, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 8, సింధ్‌లో 9, ఇస్లామాబాద్‌లో 3, బలోచిస్థాన్‌లో ఒక స్థానం ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలయ్యారు. దీంతో నేషనల్‌ అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని తమ పార్టీకి చెందిన ఎంపీలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడి సూచన ప్రకారం వారందరూ అప్పట్లోనే రాజీనామా చేశారు. ఈ క్రమంలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించడం అనివార్యంగ మారింది. అయితే ఈ రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఒకేసారి ఆమోదించకుండా.. దశల వారీగా ఆమెదిస్తుండంటం గమనార్హం.

మరోవైపు.. పాక్‌ ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. అప్పటి నుంచి 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలి. అయితే.. ఆ గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ కోరుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..

KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.

రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్

‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు

అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం