5 వారాల్లో ఎన్నికలు పెట్టుకుని రాజీనామా చేసిన ప్రధాని

హెల్సింకి: ఫిన్లాండ్‌ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని జుహా సిపిలా అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని తప్పుకోవడంతో ప్రభుత్వం కూడా రద్దయిపోయింది. ఫిన్లాండ్‌లో సామాజిక ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ఫిన్లాండ్ ప్రధానిగా సిపిలా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత దశాబ్దకాలంగా ఈ పథకం ప్రకటనలకే పరిమితమైంది. దాంతో ఇప్పటికే అనేకసార్లు తాను రాజీనామా చేస్తానని […]

  • Vijay K
  • Publish Date - 7:04 am, Sat, 9 March 19
5 వారాల్లో ఎన్నికలు పెట్టుకుని రాజీనామా చేసిన ప్రధాని

హెల్సింకి: ఫిన్లాండ్‌ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని జుహా సిపిలా అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని తప్పుకోవడంతో ప్రభుత్వం కూడా రద్దయిపోయింది. ఫిన్లాండ్‌లో సామాజిక ఆరోగ్య పథకాన్ని తీసుకురావాలని ఫిన్లాండ్ ప్రధానిగా సిపిలా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.

కానీ సంకీర్ణ ప్రభుత్వం కారణంగా ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత దశాబ్దకాలంగా ఈ పథకం ప్రకటనలకే పరిమితమైంది. దాంతో ఇప్పటికే అనేకసార్లు తాను రాజీనామా చేస్తానని చెప్పినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు మరో 5 వారాల్లో ఉన్నాయనగా నిజంగానే రాజీనామా చేసేశారు. ప్రధానిగా ఉండి కూడా సంస్కరణలు అమలుచేయలేకపోవడాన్ని వ్యక్తిగత వైఫల్యంగా భావించి పదవికి సిపిలా రాజీనామా చేశారు.