భారత్ వైపు ఆ దేశాల చూపు.. లక్కు కలిసొచ్చేనా?

ప్రపంచానికి కరోనాను పరిచయం చేసి భయోత్పాతాన్ని సృష్టించిన చైనా పట్ల ప్రపంచ దేశాలు వెగటు ప్రదర్శిస్తున్నాయి. అదే సమయంలో భారత్ వైపు ఆశావహంగా చూస్తున్నాయి. ఈ సంకేతాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది.

  • Rajesh Sharma
  • Publish Date - 2:54 pm, Tue, 21 April 20
భారత్ వైపు ఆ దేశాల చూపు.. లక్కు కలిసొచ్చేనా?

ప్రపంచానికి కరోనాను పరిచయం చేసి భయోత్పాతాన్ని సృష్టించిన చైనా పట్ల ప్రపంచ దేశాలు వెగటు ప్రదర్శిస్తున్నాయి. అదే సమయంలో భారత్ వైపు ఆశావహంగా చూస్తున్నాయి. ఈ సంకేతాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం భారత్‌కు కలిసొస్తుందా? లేక చైనా మరేదైనా కుయుక్తి ప్రదర్శిస్తుందా అన్నదిపుడు చర్చనీయాంశంగా మారింది.

కరోనా వైరస్ సహజంగా జనించిందా ? లేక చైనాలోని వూహన్‌లో బయోటెక్ పరిశోధనాశాల నుంచి ప్రమాదవశాత్తు జనించి, ప్రపంచాన్ని వణికిస్తోందా ? ఈ చర్చ ఇపుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది ముందుగా చైనా ప్రయోగాలు వికటించడమే ప్రపంచానికిపుడు శాపంగా మారిందని అమెరికా వాదన మొదలు పెట్టింది. అమెరికా వాదనతో పలు యూరప్ దేశాలు వంతపాడుతున్నాయి. జర్మనీ లాంటి దేశాలైతే ఏకంగా చైనా నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసే స్థాయికి వెళ్ళాయి.

ఈ నేపథ్యంలో మనదేశానికి ఆశావహ పరిణామాలు చోటుచేసుకుంటున్న వార్తలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుండి తమ కంపెనీలను భారత దేశానికి తరలించే ఆలోచనలో దక్షిణ కొరియా, జపాన్ , అమెరికా దేశాలకు చెందిన పలు కంపెనీలున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇండియాలో తమ ఉత్పత్తి కంపెనీలను నెలకొల్పేందుకు చర్చలు ప్రారంభించాయి దక్షిణ కొరియా, జపాన్ కంపెనీలు. చైనా నుండి కంపెనీలను తరలించేందుకు 2.2 బిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజిని ఇవ్వడానికి ముందుకు వచ్చింది గుజరాత్ రాష్ట్రం.

చైనాపై ఆధారపడడాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని నిర్ణయానికి వచ్చిన అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ కంపెనీలు దానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి ఈ కంపెనీలు. దాంతో కమిట్ మెంట్ ఇస్తూ వాటిని నిబద్దతతో నిలబెట్టుకునే భారత దేశం వైపు ఈ కంపెనీలు చూస్తున్నట్లు తెలుస్తోంది.