Europe Heatwave: యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడి గాలులు.. మరో వైపు కార్చిచ్చులు..!

Europe Heatwave: యూరప్‌ దేశాలలో వేడి గాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు వేడిగాలులు, మరోవైపు కార్చిచ్చులు.. గతంలో ఎన్నడు లేని పరిస్థితిని..

Europe Heatwave: యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడి గాలులు.. మరో వైపు కార్చిచ్చులు..!
Europe Heatwave
Follow us

|

Updated on: Jul 21, 2022 | 9:37 PM

Europe Heatwave: యూరప్‌ దేశాలలో వేడి గాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు వేడిగాలులు, మరోవైపు కార్చిచ్చులు.. గతంలో ఎన్నడు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రజలు. వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. అలవాటు లేని ప్రాణాలు కాబట్టి తల్లడిల్లిపోతున్నారు. వాతావరణ మార్పులతో యూరోప్‌ దేశాలు ఉక్కరిబిక్కిరవుతున్నాయి. దీంతో అక్కడి వాతావరరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వం జాతీయ ఎమర్జెన్సీని విధించింది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని యూకే వాతావరణ విభాగం పేర్కొంది. యూరప్‌లో అసాధారణమైన వేడి జూలై 19,2022న మరోసారి గరిష్ట స్థాయిని దాటింది. బ్రిటన్‌లోని కొన్ని ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ప్రదేశం ఈ మార్క్‌ దాటడం ఇదే మొదటిసారి. ఐరోపాలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టడం వల్ల దాదాపు 1500 మంది వరకు మరణించినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి.

తాత్కాలిక మెట్ ఆఫీస్ డేటా ప్రకారం.. జూలై 19కి ముందు UKలో అత్యధికంగా 38.7C, కేంబ్రిడ్జ్ బొటానిక్ గార్డెన్స్‌లో 25 జూలై 2019న నమోదైంది. అయినప్పటికీ, ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేరచ్కొంటున్నారు. కండరాల తిమ్మిరి, వేడి అలసట నుండి మరింత తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితుల వరకు అనేక రకాల రుగ్మతలకు తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత దాదాపు 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వద్ద నమోదువుతోంది. బయటి ఉష్ణోగ్రత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బయటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మెదడులోని భాగం గ్రహించి ఆ వ్యక్తికి చెమటలు పట్టేలా చేస్తోంది. శరీరం చెమట పట్టకపోతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో తగినంత హైడ్రేషన్‌ లేకపోతే హీట్‌స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

హైపర్ థైరాయిడిజం ఉన్నవారు తీవ్రమైన వేడి వేవ్‌లో అసౌకర్యానికి గురవుతారని రాజధానిలోని సికె బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ రాజీవ్ గుప్తా తెలిపారు. హైపర్ థైరాయిడిజంలో అంతర్గతంగా శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దడ, చెమటలు, వేడిగా అనిపించడం వంటి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్‌ గుప్తా తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.అధిక ఉష్ణోగ్రతలతో స్ట్రోక్, అలెర్జీల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. మెదడు పనిచేయడం ఆగిపోవచ్చు. విపరీతమైన వేడి తలనొప్పి, ఇతర అలర్జీలను ప్రేరేపిస్తుందని రాజధానిలోని సర్ గంగారామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మనోజ్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో చల్లని వాతావరణం నెలకొంది. కానీ బ్రిటన్‌లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. హై టెంపరేచర్ నమోదవుతోంది. యూరప్‌ మొత్తం వడగాల్పులతో అట్టుడుకుతోంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వడగాడ్పులకు జనం అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌లో అయితే కని వినీ ఎరుగని విధంగా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. యూరోప్‌లోని ఫ్రాన్స్‌, పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, మొరాకో దేశాల్లోని వేలాది ఎకరాల అడవులను, నివాస ప్రాంతాలను మంటలు దహించేస్తున్నాయి. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో కార్చిచ్చును ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్‌లోని లాండిరాస్, గిరోండేలో ప్రాంతాల్లో మంటలు ఆకాశన్నంటేలా ఎగిసిపడుతున్నాయి.. జనావాసాలకు కార్చిచ్చు దహించేసింది, ఇళ్లు, వాహనాలు కాలిబూడిదయ్యాయి.

యూరోప్‌ దేశాల్లో కొనసాగుతున్న ఈ భిన్నవాతావరణానికి వాతావరణ మార్పులే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు . మున్ముందు యూరోప్‌ నిప్పుల కుంపటిలా తయారవుతుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని చాలా చోట్ల టెంపరేచర్లు పెరుగుతుండటం వల్ల కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులపై హెచ్చరికలు చేసిన అధికారులు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏకంగా కొన్ని చోట్ల విమాన రాకపోకలను నిలిపివేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల రన్ వే చెడిపోవడంతో విమానాలను దారి మళ్లిస్తున్నారు.

యూకేలోని పట్టణ ప్రాంతాల్లో రాత్రుల్లో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ యూకేలో అత్యధిక ఉష్ణోగ్రతలు 2019లో రికార్డయ్యాయి. ఆ ఏడాది టెంపరేచర్లు ఏకంగా 38.7 డిగ్రీస్ సెల్సియస్ దాటింది. కేంబ్రిడ్డ్‌ బొటానిక్ గార్డెన్‌లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే వేడి కొనసాగితే ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావటంతో పాటు ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు అక్కడి నిపుణులు.

పలు ప్రాంతాల్లో యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, వాతావరణ విభాగం గత వారమే లెవల్ -3 హీట్ హెల్త్ నోటీసులు జారీ చేశాయి. హెల్త్‌కేర్ ఏజెన్సీలు మునుపటి కన్నా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పుడా స్థాయి కూడా దాటిపోవటం వల్ల లెవల్-4 నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగితే హైరిస్క్‌లో ఉన్న వారితో పాటు ఆరోగ్యంగా ఉన్న ప్రజలపైనా ప్రభావం పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు