Ever Given Ship: చిక్కు నుంచి తప్పించుకున్నా ఆ భారీ నౌకకు కష్టాలు తప్పట్లేదు.. జరిమానా చెల్లించేదాకా వదిలేదంటోన్న..

Ever Given Ship: సూయజ్‌ కాలువలో రవాణాతో వెళుతోన్న ఎవర్‌ గివెన్‌ అనే నౌక ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గత నెల 23న ఈ సంఘటన జరిగింది. ఈ నౌక విషయమై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది...

Ever Given Ship: చిక్కు నుంచి తప్పించుకున్నా ఆ భారీ నౌకకు కష్టాలు తప్పట్లేదు.. జరిమానా చెల్లించేదాకా వదిలేదంటోన్న..
Ever Given Ship
Follow us

|

Updated on: Apr 13, 2021 | 9:15 PM

Ever Given Ship: సూయజ్‌ కాలువలో రవాణాతో వెళుతోన్న ఎవర్‌ గివెన్‌ అనే నౌక ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. గత నెల 23న ఈ సంఘటన జరిగింది. ఈ నౌక విషయమై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆసియా, యూరప్‌ల మధ్య సరుకులు రవాణా చేసే ఈ భారీ నౌక కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. నౌకలో ఒక భాగం భూమిలోకూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు దాదాపు వారం రోజులుగా నిపుణులు కృషి చేశారు. అనంతరం ఈ భారీ నౌకను తిరిగి కాలువలోకి తీసుకొచ్చి గ్రేట్‌ బిట్టర్‌ లేక్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇక కథ సుఖాంతం అయ్యిందని అనుకుంటున్న సమయంలోనే అసలు సమస్య వచ్చి పడింది. నౌక కాలువలో ఇరుక్కు పోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని ఈజిప్టు ప్రభుత్వం సదరు నౌక యజమానులను బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్‌ ప్రభుత్వ అధికారులతో ఎవర్‌ గివెన్‌ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్‌ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ చర్చలు ఫలించి ఎవర్‌ గివెన్‌ తన ప్రయాణాన్ని తిరిగి ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి. ఇక నౌకకు విధించిన బిలియన్‌ డాలర్ల జరిమాన మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ. ఏడు వేల కోట్లకు పైమాటే.. ఇంతలా జరిమాన విధించడానికి గల కారణమేంటనేగా మీ సందేహం.. ఈ నౌక నిలిచిపోవడం వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు మరి. రోజుకు ఏకంగా 9 బిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 65 వేల కోట్లకు పైమాటే. ఇక ఈ నౌక చిక్కుకుపోవడంతో ఈ కాలువ మీదుగా వెళ్లాల్సిన సుమారు 369 నౌకలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి.

Also Read: బీజేపీలో చేరిన నటి హేమ.. ఫస్ట్ స్పీచ్‌తోనే బీజేపీ నేతలకు చుక్కలు.. వైరల్‌గా మారిన వీడియో

Cyber Attack: అమెరికా, ఇజ్రాయేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇరాన్.. పరిస్థితి క్లిష్టంగా మార్చొద్దని వార్నింగ్!

Refund: వెంటనే డబ్బులు రిఫండ్ చేయండి.. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం!

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ