Sri Lanka: శ్రీలంకలో చేయి దాటిపోతున్న పరిస్థితులు.. భారత్ వైపు శరణార్థుల చూపు

శ్రీలంక(sri lanka) లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఉపాధి లేక వీధిన పడ్డారు. కొలంబోలోని (Colombo) ఫ్లోటింగ్ మార్కెట్ మూతపడింది. సింగపూర్ నమూనాతో నీటిపై నిర్మించిన ఈ మార్కెట్ లో పడవలపై షాపింగ్...

Sri Lanka: శ్రీలంకలో చేయి దాటిపోతున్న పరిస్థితులు.. భారత్ వైపు శరణార్థుల చూపు
Srilanka Crisis
Follow us

|

Updated on: Apr 11, 2022 | 7:47 AM

శ్రీలంక(sri lanka) లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎంతోమంది ఉపాధి లేక వీధిన పడ్డారు. కొలంబోలోని (Colombo) ఫ్లోటింగ్ మార్కెట్ మూతపడింది. సింగపూర్ నమూనాతో నీటిపై నిర్మించిన ఈ మార్కెట్ లో పడవలపై షాపింగ్ చేస్తారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఫలితంగా ఫ్లోటింగ్ మార్కెట్(Floating Market in Colombo) మూసివేశారు. అంతేకాకుండా శ్రీలంకలో డీజిల్ లేక మత్స్యకారుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల నుంచి డీజిల్ అందుబాటులో లేక బోట్లన్నీ తీర ప్రాంతంలోనే నిలిచిపోయాయి. తిండి లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఉపాధి లేక మత్స్యకారులందరూ భారత్ తీరం వైపు అక్రమంగా తరలించడానికి సిద్దపడుతున్నారు. ఏదో రకంగా భారత తీరంలోకి వెళ్తే ఉపాధి దొరుకుతుందని రాత్రివేళల్లో బయల్దేరుతున్నారు.

శ్రీలంకకు భారత ఇంటెలిజెన్స్ హై అలర్ట్ ఇచ్చింది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ లోకి భారీగా తరలిపొతున్నారని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఆ దేశంలో నెలకొన్న సంక్షోభంతో జీవించే దారి లేక సముద్రమార్గం ద్వారా పడవల్లో భారత్ కు వస్తున్నారని వెల్లడించింది. వారిని కట్టడి చేయాలని సూచించింది. అంతేకాకుండా సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ నూ అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కేంద్రం, ఏపీ తీర ప్రాంతాల్లో మత్స్యకారులను ఏపీ పోలీసులు అలర్ట్ చేశారు. సముద్రంలో ఎవరివైనా అపరిచిత బోట్లు వ్యక్తులు తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరోవైపు.. జోరున కురుస్తున్న వర్షంలోనూ లంకేయులు ఆందోళన కొనసాగిసూనే ఉన్నారు. ప్రధాని రాజపక్స ఇంటి ముందు గొడుగులు పట్టుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఫ్లకార్డులు పట్టుకుని తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని నాశనం చేసి, భావి తరాలు జీవించే అవకాశం లేకుండా చేయొద్దని వేడుకుంటున్నారు.

Also Read

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Jagan Cabinet 2.0: నాడు వైఎస్ఆర్ ప్రోత్సాహం.. నేడు వైఎస్ జగన్‌ కొత్త కేబినెట్‌లో చోటు.. ఎవరో తెలుసా..

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!