Royal Gold Biryani: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదే.. ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 19,700

Royal Gold Biryani: మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళితే బిర్యానీ, ఫుడ్‌ను ఆర్డర్‌ ఇస్తుంటాం. రెస్టారెంట్‌కు వెళితే ఎక్కువగా ఇష్టపడేది బిర్యానీ. ఇక బీర్యానీ ఖరీదు ఎంతుంటుంది...

  • Subhash Goud
  • Publish Date - 10:08 pm, Tue, 23 February 21
Royal Gold Biryani: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదే.. ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 19,700

Royal Gold Biryani: మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళితే బిర్యానీ, ఫుడ్‌ను ఆర్డర్‌ ఇస్తుంటాం. రెస్టారెంట్‌కు వెళితే ఎక్కువగా ఇష్టపడేది బిర్యానీ. ఇక బీర్యానీ ఖరీదు ఎంతుంటుంది మా అయితే రూ.100 నుంచి 1000 వరకు. రుచిత బట్టి ధర ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. విదేశాల్లో అయితే బిర్యానీ లవర్స్‌ బోలెడు మంది ఉన్నారు. ఇక బిర్యానీలో ఉపయోగించే పదార్థాలను బట్టి రేటు ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ దుబాయ్‌లో దొరికే ఓ స్పెషల్‌ బిర్యానీ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ఏకంగా 1000 దిర్హామ్‌లు ( మన కరెన్సీలో అయితే దాదాపు రూ. 19,700).

‘రాయ్‌ గోల్డ్‌ బిర్యానీ’తో పిలిచే ఈ బిర్యానీ పేరుకు తగ్గట్లుగానే గోల్డ్‌తో ఉంటుంది. అంటే ఎంతో రుచికరమైన బిర్యానీని 23 క్యారెట్ల గోల్డ్‌ ప్లేట్‌లో వడ్డిస్తారు. అందుకే ఇంత ఎక్కువ ధరన్నమాట. అంతేకాదండోయ్‌… ధరకు తగ్గట్లుగాగా ఈ బిర్యానీ చాలా ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా బిర్యానీలో ఒకే రకమైన అన్నం ఉంటుంది. కానీ రాయల్‌ గోల్డ్‌లో మాత్రం బిర్యానీ రైస్‌, కీమా రైస్‌, వైట్‌ రైస్‌, సాఫ్రాన్‌ (కుంకుమ పువ్వు) రైస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో రుచిగల బిర్యానీ ఉంటుందట. మీ రుచికి తగ్గట్లుగా వారు సర్వ్‌ చేస్తారన్నమాట.

బిర్యానీ బరువు 3 కిలోలు..

ఈ బిర్యానీ బరువు సుమారుగా మూడు కిలోలు ఉంటుంది. దీంతో పాటు బంగారం రేకుల్లో చుట్టిన కశ్మీరీ లాంబ్ సీక్స్‌ కబాబ్స్‌,రాజ్‌ పుత్‌ చికెన్‌ కబాబ్స్‌, ఢిల్లీ లాంబ్‌ చాప్స్‌. జీడీపప్పు,గుడ్లు, దానిమ్మ, మొగలాయ్‌ కోఫ్తా, మలాయ్‌ చికెన్‌ రోస్ట్‌, బంగాళ దుంప, పుదీనాలతో ఎంతో కలర్‌ ఫుల్‌గా అందంగా దీనిని తీర్చిదిద్దుతారు. అంతేకాదు.. ఈ బిర్యానీ సర్వ్‌ చేయడానికి వచ్చే రెస్టారెంట్‌ సిబ్బంది సైతం బంగారు పూత కలిగిన డ్రెస్‌ కోడ్‌ను ధరిస్తారట. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. మరీ మీరు కూడా బిర్యానీ రుచి చూడాలంటే దుబాయ్‌కి వెళ్లినప్పుడు ఈ గోల్డ్‌ బిర్యానీని ఓ సారి రుచి చూడండి.