టెర్రర్ ఎటాక్.. 54 మంది జవాన్లు మృతి

ఉగ్రదాడితో ఆఫ్రికా వణికిపోయింది. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా చేసుకుని మాలిలో.. టెర్రరిస్టులు దాడులకు దిగారు. నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. తొలుత మేన‌క ప్రాంతంలో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్ర‌వాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. […]

టెర్రర్ ఎటాక్.. 54 మంది జవాన్లు మృతి
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 7:46 PM

ఉగ్రదాడితో ఆఫ్రికా వణికిపోయింది. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా చేసుకుని మాలిలో.. టెర్రరిస్టులు దాడులకు దిగారు. నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. తొలుత మేన‌క ప్రాంతంలో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్ర‌వాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. ఆ తర్వాత నార్తర్న్ మాలిలోని ఆర్మీ పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు.

కాగా, సెప్టెంబర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 38 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బుర్కినో ఫాసోలో ఇద్ద‌రు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరు అల్ ఖాయిదా, ఐసీస్‌తో సంబంధం ఉన్న వారిగా గుర్తించారు. అయితే తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన దాడికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఉగ్ర సంస్థ బాధ్య‌త ప్ర‌క‌టించ‌లేదు. అయితే నార్త్ మాలి ప్రాంతంలో ఆల్‌ ఖాయిదా ఉగ్ర‌వాదులు ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రెంచ్ ద‌ళాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌తో ఉగ్ర‌వాదులు ప్ర‌తిదాడుల‌కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఖాయిదా సంస్థకు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి కూడా పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.