సోదరుడి మృతి.. ట్రంప్ భావోద్వేగ ప్రకటన‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్‌(71) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై గత కొన్ని రోజులుగా న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు

సోదరుడి మృతి.. ట్రంప్ భావోద్వేగ ప్రకటన‌
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 12:25 PM

Donald Trump Brother: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్‌(71) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై గత కొన్ని రోజులుగా న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయంపై ట్రంప్ భావోద్వేగ ప్రకటనను చేశారు. అందులో బరువెక్కిన హృదయంతో చెబుతున్నా. నా సోదరుడు రాబర్ట్ కన్నుమూశారు. అతడు నా సోదరుడు మాత్రమే కాదు. నా ప్రియమైన స్నేహితుడు. నేను అతడిని చాలా మిస్ అవుతున్నా. మేం మళ్లీ కలుసుకుంటాం. సోదరుడి ఙ్ఞాపకాలు నా మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. రాబర్ట్‌.. ఐ లవ్‌ యు. రెస్ట్ ఇన్ పీస్‌ అని ఉంది. కాగా డొనాల్డ్ ట్రంప్‌, రాబర్ట్ ట్రంప్‌ కొన్నేళ్ల పాటు కుటుంబ వ్యాపారం విజయవంతంగా కొనసాగించారు. అలాగే ట్రంప్ జీవితంలో హనీ అని అతడు పిలిచే ఏకైక వ్యక్తి రాబర్ట్ కావడం విశేషం.

Read More:

ఉపాసనను భార్యగా పొందడం నా అదృష్టం: రామ్ చరణ్‌

విశాఖలో పుర్రెతో కలకలం రేపిన సైకో