Donald Trump: ఓ వార్తా సంస్థపై వేల కోట్ల పరువు నష్టం దావా వేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఎందుకో తెలుసా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్ఎన్ వార్తా సంస్థపై పరువునష్టం దావా వేశాడు. తన పరువు, పటిష్టలకు నష్టం కలిగించారని ఆరోపిస్తే ఆయన సీఎన్ ఎన్ వార్తా సంస్థపై రూ.3867 కోట్ల రూపాయల పరువు..

Donald Trump: ఓ వార్తా సంస్థపై వేల కోట్ల పరువు నష్టం దావా వేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఎందుకో తెలుసా..
Donald Trump
Follow us

|

Updated on: Oct 04, 2022 | 10:13 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్ఎన్ వార్తా సంస్థపై పరువునష్టం దావా వేశాడు. తన పరువు, పటిష్టలకు నష్టం కలిగించారని ఆరోపిస్తే ఆయన సీఎన్ ఎన్ వార్తా సంస్థపై రూ.3867 కోట్ల రూపాయల పరువు నష్టం కోరుతూ.. ఫ్లోరిడా కోర్టులో దావా వేశారు. తనపై సీఎన్‌ఎన్‌ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపించిన ఆయన 475 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని కోరారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలో దిగే అవకాశాలను దెబ్బతీసేలా సీఎన్‌ఎన్‌ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. 2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ది బిగ్ లై పేరిట సీఎన్ ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ప్రచారం.. తనకు నష్టం కలిగించిందని అన్నారు.

అధికారంలో ఉన్న సమయంలో ట్రంప్‌ సీఎన్‌ఎన్‌పై తరచూ విమర్శలు చేసేవారనే విషయం తెలిసిందే. ట్రంప్‌ గతంలోనూ పలు దిగ్గజ కంపెనీలపై దావా వేశారు. కానీ, చాలా తక్కువసార్లు ఆయనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి అనంతరం ట్విటర్‌ ఆయన్ను ఆ సామాజిక మాధ్యమం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అప్పుడు కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ, కాలిఫోర్నియా కోర్టు ఆయన వ్యాజ్యంపై వాదనలు వినడానికి నిరాకరించింది.

‘ది బిగ్‌ లై’ పేరిట సీఎన్‌ఎన్‌ జరిపిన దుష్ప్రచారంలో దాదాపు 7,700 సార్లు తన గురించి ప్రస్తావించారని ట్రంప్‌ తన దావాలో పేర్కొన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసి, తనపై దురాభిప్రాయానికి కలగజేయడానికి వారు అలా చేశారని ఆరోపించారు. ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్న మరికొన్ని ఛానళ్లపై కూడా తాను దావా వేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఏ సంస్థలపై అనేది స్పష్టత ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..