World Bank: శ్రీలంక పరిస్థితులపై ఆందోళన ఉంది.. కానీ రుణాలు మాత్రం ఇవ్వం: ప్రపంచ బ్యాంకు

పీకల్లోతు అప్పుల్లో ఉన్న శ్రీలంకకు ప్రపంచ బ్యాంక్‌ మొండి చేయి చూపింది. ప్రస్తుతానికి సహాయం చేసే అలోచన లేదని స్పష్టం చేసింది. ఆ దేశంలో స్థూల ఆర్థిక విధానానికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఏర్పడే వరకూ ఆర్థిక సాయం అందించడం సాధ్యం కాదని తెలిపింది.

World Bank: శ్రీలంక పరిస్థితులపై ఆందోళన ఉంది.. కానీ రుణాలు మాత్రం ఇవ్వం: ప్రపంచ బ్యాంకు
Sri Lanka Crisis
Follow us

|

Updated on: Jul 30, 2022 | 6:40 AM

World Bank on Sri Lanka: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు కష్టాలు మరిన్ని పెరిగాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ బ్యాంకు సహకరిస్తుందని శ్రీలంక గంపడాశలు పెట్టుకుంది.. కానీ ప్రపంచ బ్యాంకు మాత్రం చేతులు దులుపేసుకుంటూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి శ్రీలంకకు ఆర్థిక సాయం చేసే ప్రణాళికగానీ, ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. ఆ దేశంలో స్థూల ఆర్థిక విధానానికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ఏర్పడే వరకూ ఆర్థిక సాయం అందించడం సాధ్యం కాదని తెలిపింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభం అక్కడి ప్రజలపై చూపుతున్న ప్రభావంపై తీవ్ర ఆందోళన ఉందని.. కానీ ఎటువంటి ఆర్థిక సాయం చేయలేమంటూ ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆహారం, మందులు, వంటగ్యాస్‌ తదితర అవసరాల కోసం శ్రీలంకకు ఇప్పటికే రుణాలను మంజూరు చేశామని.. ప్రస్తుతం రుణం ఇచ్చే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే.. శ్రీలంకలో పరిస్థితులను గాడిన పెట్టడానికి అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే దృష్టిసారించారు. దేశ వ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీని పొడగించారు. అన్ని రాజకీయ పక్షాలతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ నాయకుడు మైత్రిపాలసిరి సేనతో చర్చలు జరిపారు. నేషనల్‌ ఫ్రీడమ్‌ ఫ్రంట్‌ విక్రమ సింఘేకు మద్దతు ఇస్తున్నా, ఎస్‌జేబీ కలిసి రావడం లేదు.. కాగా ప్రజలు రణిల్‌ విక్రమ సింఘేను అనుమానంగానే చూస్తున్నారు. శ్రీలంకలో రాజకీయ స్థిరత్వం వస్తే కానీ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటం కష్టమని భావిస్తున్నారు ఆర్థిక వేత్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..