ఆ గుర్తు తెలియని వ్యాధి కూడా కరోనానే కావొచ్చు: డబ్ల్యూహెచ్‌ఓ

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో కోవిడ్‌ని మించిన మరో కొత్త వైరస్‌ వచ్చిందని చైనా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 5:52 pm, Sat, 11 July 20
ఆ గుర్తు తెలియని వ్యాధి కూడా కరోనానే కావొచ్చు: డబ్ల్యూహెచ్‌ఓ

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో కోవిడ్‌ని మించిన మరో కొత్త వైరస్‌ వచ్చిందని చైనా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కజకిస్థాన్ ఆ వార్తలు అవాస్తవమని వెల్లడించింది. కొత్త వ్యాధికి బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా లక్షణాలు ఉన్నాయని.. ఇది ఎలా వచ్చిందో స్పష్టమైన కారణాలు తెలీడం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గుర్తు తెలియనిదిగా భావిస్తున్న న్యూమోనియాకు కరోనా వైరస్‌ ఓ కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ మైకేల్‌ రేయాన్ తెలిపారు. చాలా న్యూమోనియా కేసులకు కరోనాయే కారణమని తాము భావిస్తున్నామని, స్థానిక అధికారులతో ఎక్స్‌రేలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు చేసేందుకు తమ బృందం ఇప్పటికే కజకిస్థాన్‌లో ఉందని రేయాన్‌ వెల్లడించారు.