పాక్‌ నేతలని గజగజ వణికిస్తోన్న మహిళ.. ఇంతకు ఈమె ఎవరంటే..!

ప్రపంచమంతా కరోనాతో భయపడుతుంటే.. పాకిస్థాన్ రాజకీయ నేతలను ఆ వైరస్‌తో పాటు మరో భయం కూడా వెంటాడుతోంది. అమెరికాకు చెందిన ఓ మహిళ, పాక్ రాజకీయ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

పాక్‌ నేతలని గజగజ వణికిస్తోన్న మహిళ.. ఇంతకు ఈమె ఎవరంటే..!
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 10:58 AM

ప్రపంచమంతా కరోనాతో భయపడుతుంటే.. పాకిస్థాన్ రాజకీయ నేతలను ఆ వైరస్‌తో పాటు మరో భయం కూడా వెంటాడుతోంది. అమెరికాకు చెందిన ఓ మహిళ, పాక్ రాజకీయ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి అగ్రనేతల తెర వెనుక విషయాలను వెలుగులోకి తెస్తూ వారి రాజకీయ భవిష్యత్‌కు చెక్ పెడుతోంది. దీంతో ఆమె పేరు తలచుకుంటే చాలు అక్కడి రాజకీయ నేతలు భయపడుతున్నారు. ఇంతకు ఆమె పేరు ఏంటంటే సింథియా డాన్ రిచీ.

అసలు సింథియా ఎవరు..? సింథియా డాన్ రిచీ.. అమెరికాకు చెందిన మహిళ. ఓ షార్ట్‌ఫిల్మ్ మేకర్, యూట్యూబర్‌, ఎన్‌జీవోలో ఆమె పనిచేస్తోంది. ఆమె టెక్సాస్‌లో చదువుకునే సమయంలో పాక్‌కు చెందిన అజమ్ స్వాతి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఆయన పాక్ చట్టసభలో సభ్యుడయ్యాడు. ఇక 2009లో టూరిస్ట్‌లా పాక్‌కి వెళ్లిన ఆమె.. అజమ్ సాయంతో అప్పటి పాక్‌ సైన్స్ మినిస్టర్ ముఖ్దుం షాబుద్దీన్ వద్ద సహాయకురాలిగా పని చేశారు. అలా పాక్‌ పవర్ కారిడార్‌లో అడుగుపెట్టిన సింథియా మెల్లగా తన పట్టును పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో పాక్‌ నిఘా సంస్థకు ప్రచారకర్తగా కూడా పనిచేశారు. పాక్‌ సైనికల ప్రచార విభాగమైన ఐఎస్‌పీఆర్‌కి పనిచేశారు. అంతేకాదు భారత్‌పై కూడా పలు ఆరోపణలు చేసింది. ఇంకా చెప్పాలంటే పాక్ కారిడార్‌లో ఆమెకు దాదాపు ఎదురులేదనే చెప్పొచ్చు. ఉద్రిక్త సమయాల్లో కూడా ఆ దేశ రహస్య సైనిక స్థావరాలకు, ప్రధాని నివాసానికి, అధ్యక్షుని బంగ్లాకు, మంత్రుల నివాసాలకు వెళ్లగలిగే చొరవ ఉందంటే.. అక్కడ సింథియా బలమేంటో అర్థమవుతోంది.

రాజకీయ నేతలపై సింథియా ఆరోపణలు: 1.మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, తన భర్త అసీఫ్‌ అలీ జర్దారీతో సంబంధాలు పెట్టుకున్న మహిళలపై సెక్యూరిటీ గార్డులతో అత్యాచారాలు చేయించేది అని సింథియా వెల్లడించింది. 2.2011లో పాక్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యకార్యాలయంలోని వారిని చెప్పానని, కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు అని సింథియా ఓ ట్వీట్‌లో తెలిపింది. 3.మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్దుం షాబుద్దీన్‌లు అధ్యక్ష భవనంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని సింథియా పేర్కొంది. 4.పాక్ నాయకులు యువతులతో కలిసి పార్టీలు చేసుకుంటున్న ఫొటోలను ఆమె భయటపెట్టింది. 5.పాక్‌ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తనతో గడపమని కోరారని ఆమె ఆరోపణలు చేసింది.

అయితే ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీఐటీ పార్టీకి అనుకూలంగా సింథియా ఆరోపణలు చేస్తోందని ప్రతిపక్ష పీపీపీ(పాకిస్థానీ పీపుల్స్ పార్టీ)నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పీపీపీ అగ్రనేత బిలావల్ భుట్టో వ్యక్తిగత జీవిత రహస్యాలను ఆమె భయటపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఆమెపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్: అయ్యప్ప భక్తులకు షాక్‌

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..