Covid in China: మళ్ళీ చైనాలో కరోనా కల్లోలం.. జియాన్‌ లో ఏడు రోజులు లాక్ డౌన్.. నిర్బధంలోకి 13 మిలియన్ల జనాభా

కరోనావైరస్ (COVID-19) కేసుల వ్యాప్తిని నివారించడానికి పురాతన చైనీస్ నగరమైన జియాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు

Covid in China: మళ్ళీ చైనాలో కరోనా కల్లోలం.. జియాన్‌ లో ఏడు రోజులు లాక్ డౌన్.. నిర్బధంలోకి 13 మిలియన్ల జనాభా
Corona In China
Follow us

|

Updated on: Jul 06, 2022 | 12:33 PM

Covid in China: కోవిడ్ 19 పుట్టినిల్లు అయినా చైనా లో మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. కరోనా నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. జియాన్‌ (Xi’an)నగరంలో ఏడు రోజుల తాత్కాలిక నియంత్రణ చర్యలన అమలు చేయనున్నామని నగర అధికారి జాంగ్ జుడాంగ్ చెప్పారు. ఈ నియంత్రణ చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని వీలైనంత వరకూ తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా నమోదవుతున్న కేసుల్లో అధికంగా ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కేసులే. కరోనావైరస్ (COVID-19) కేసుల వ్యాప్తిని నివారించడానికి పురాతన చైనీస్ నగరమైన జియాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. 13 మిలియన్ల జనాభా ఉన్న జియాన్‌లోని వ్యాపారాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు ఒక వారం పాటు మూసివేయనున్నామని అధికారులు తెలిపారు.

గత సంవత్సరం చివరిలో..  చారిత్రాత్మక నగరం జియాన్ నెల రోజుల లాక్‌డౌన్‌ను విధించారు. ఇప్పుడు, నగరంలో ఒక క్లస్టర్‌లో శనివారం నుండి 18 కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్‌లో  ఉన్న ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఈ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జాంగ్ లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ.. మేము సమయం, వైరస్ రెండింటికీ వ్యతిరేకంగా పోటీ పడాలన్నారు.  సాధ్యమైనంత వరకూ కరోనా వ్యాప్తిని నివారించి.. రానున్న ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి,  నిర్ణయాత్మకంగా  చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తాజా లాక్ డౌన్ నిబంధనలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. నగర పాలక సంస్థ నోటీసు ప్రకారం, పబ్‌లు, ఇంటర్నెట్ కేఫ్‌లు , కరోకే బార్‌లతో సహా పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలు వారం రోజుల పాటు మూసివేయబడతాయి.

రెస్టారెంట్‌లు డైనర్‌లకు ఇంటికి సర్వ్ చేయడానికి అనుమతి లేదని.. అయితే టేక్‌అవే సేవలను కస్టమర్స్ కు కొనసాగించవచ్చని నోటీసులో పేర్కొంది. పాఠశాలలు వేసవి సెలవులను ముందుగానే ప్రారంభించాలని,  విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను మూసివేయాలని అధికారులు సూచించారు.

మార్నిం అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..