బ్రెజిల్ స్ట్రెయిన్ వైరస్‌తో ఇండియాలో ఆందోళన, నిపుణుల విశ్లేషణ, చైనా వైరస్‌తో పోలిక, ముమ్మరమైన రీసెర్చ్

బ్రిటన్ లో పుట్టిన మ్యుటెంట్ స్ట్రెయిన్ తరువాత తాజాగా బ్రెజిల్ లో కాలుమోపిన వైరస్ ఒకటి బయటపడింది

  • Umakanth Rao
  • Publish Date - 4:04 pm, Sat, 16 January 21
బ్రెజిల్ స్ట్రెయిన్ వైరస్‌తో ఇండియాలో ఆందోళన, నిపుణుల విశ్లేషణ, చైనా వైరస్‌తో పోలిక, ముమ్మరమైన రీసెర్చ్

బ్రిటన్ లో పుట్టిన మ్యుటెంట్ స్ట్రెయిన్ తరువాత తాజాగా బ్రెజిల్ లో కాలుమోపిన వైరస్ ఒకటి బయటపడింది. నెక్స్ట్ స్ట్రెయిన్ అని వ్యవహరిస్తున్న ఈ స్ట్రెయిన్ ను ఆ దేశంలో ఇటీవలే కనుగొన్నారు. ఇప్పటికే ఇది 10 మ్యుటేషన్లను మార్చుకున్నదని, అసలిది ప్రస్తుతం డెవలప్ అవుతున్న వివిధ రకాల వ్యాక్సిన్లకు రియాక్ట్ అవుతుందా, కాదా అని నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. ఇమ్యూన్ సిస్టం (రోగనిరోధక వ్యవస్థ) నుంచి తప్పించుకున్న పలు స్టెయిన్లలో బ్రెజిల్ స్ట్రెయిన్ ఒకటని  భావిస్తున్నారు. పైగా ఇది పలు జన్యు మార్పులకు కూడా లోనైనట్టు తేలింది. ఇండియాలో ఇప్పటివరకు నెక్స్ట్ స్ట్రెయిన్ కేసులు లేనప్పటికీ మొత్తానికి ఇది కూడా ఆందోళన కలిగించేదే అని ఓ రీసెర్చర్ పేర్కొన్నారు. బ్రెజిల్ తో బాటు జపాన్ లో కూడా ఈ స్ట్రెయిన్ వ్యాప్తి చెందింది. ఇప్పటికే చైనాలోని వూహన్ సిటీలో మొదటిసారిగా కనుగొన్న స్ట్రెయిన్ నుంచి కోలుకున్న రోగులకు నెక్స్ట్ స్ట్రెయిన్ నుంచి మళ్ళీ ముప్పు పొంచివుందని అంటున్నారు. అయితే ఇంకా పరిశోధనలు సాగుతున్నాయని. ఇప్పటికిప్పుడు నిర్ధారించి ఏమీ చెప్పలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇలా ఉండగా కోవిడ్ 19, దాని వేరియంట్లకు సంబంధించి 3.50 లక్షల సీక్వెన్సులను ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞులు తమలో తాము షేర్ చేసుకోవడం విశేషం, ఒక వైరస్ పై ఇంత పెద్ద ఎత్తున భారీ ఎక్సర్ సైజ్ జరగడం బహుశా ఇదే మొదటిసారని భావిస్తున్నారు.