26 దేశాలకు విస్తరించిన కరోనా.. 425కు చేరిన మృతుల సంఖ్య..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 26 దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు తెలుస్తుండగా.. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలోని హుబెయ్ ఫ్రావిన్సులో 24 గంటల వ్యవధిలో ఈ వ్యాధి సోకిన 64మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో చైనాలో కరోనా మరణాల సంఖ్య 425కు చేరింది. కాగా చైనాలో ఇంకా 20,438 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించగా.. వారిలో 492 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో పడకలు […]

26 దేశాలకు విస్తరించిన కరోనా.. 425కు చేరిన మృతుల సంఖ్య..!
Follow us

| Edited By:

Updated on: Feb 05, 2020 | 9:12 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 26 దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు తెలుస్తుండగా.. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలోని హుబెయ్ ఫ్రావిన్సులో 24 గంటల వ్యవధిలో ఈ వ్యాధి సోకిన 64మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో చైనాలో కరోనా మరణాల సంఖ్య 425కు చేరింది. కాగా చైనాలో ఇంకా 20,438 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించగా.. వారిలో 492 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో వుహాన్‌లో ఓ ఎగ్జిబిషన్‌ సెంటర్‌నే తాత్కాలిక ఆసుపత్రిగా మార్చి 3400 పడకలు ఏర్పాటు చేశారు. అనుమానిత రోగుల్ని అక్కడకు తరలిస్తున్నారు. మరికొన్ని వేదికల్ని, జిమ్నాజియాలను కూడా ఆసుపత్రులుగా మార్చబోతున్నారు.

మరోవైపు కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో దీనికి విరుగుడు కనిపెట్టేందుకు చైనా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి యాంటీవైరల్‌ మందుల్ని రోగులకు ఇస్తుండగా.. ఎబోలా, సార్స్‌ వంటి జబ్బుల్ని నయం చేయడానికి వాడే ఔషధాలను కూడా పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన ఓ సంస్థ తయారు చేసిన యాంటీ వైరల్‌ మందును అక్కడి ఒక రోగికి ఇవ్వగా.. ఒక్కరోజులోనే పరిస్థితి మెరుగైంది. కాగా కరోనా వైరస్‌ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. దీని తీవ్రత ఎక్కువగానే ఉన్నా ఇంకా ఇది ప్రపంచస్థాయిది కాదని ఆ సంస్థ తెలిపింది. హుబెయ్‌ వెలుపల కొన్నిచోట్ల మాత్రమే ఈ వైరస్‌ వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి సైల్వీ బ్రియాండ్‌ తెలిపారు.