కరోనా విలయం.. ఎయిర్ సర్వీసులకు పెను గండం !

రోజురోజుకీ ప్రబలమవుతున్న కరోనాను ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు మే నెలాఖరుకల్లా పెను గండం తప్పదట.

కరోనా విలయం.. ఎయిర్ సర్వీసులకు పెను గండం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 4:40 PM

రోజురోజుకీ ప్రబలమవుతున్న కరోనాను ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు మే నెలాఖరుకల్లా పెను గండం తప్పదట.. ఈ వైరస్ నివారణకు తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో.. ఇవన్నీ మూతబడడమో, సాంకేతిక నష్టాలతో చతికిలబడడమో దాదాపు ఖాయమని ఆస్ట్రేలియా (సిడ్నీ) లోని సీఏపీఏ (సెంటర్ ఫర్ ఏవియేషన్) సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయని ఓ కన్సల్టెంట్ తెలిపారు. కరోనా కారణంగా అనేక దేశాలు తమ బోర్డర్లను మూసివేసిన కారణంగా చాలా విమానాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ప్రయాణికులు లేక దాదాపు ఖాళీగా ఉంటున్నాయి. అని ఆయన చెప్పారు.

అమెరికా, చైనా, మధ్యప్రాచ్య దేశాల్లోని ఎయిర్ లైన్స్ మనుగడ సాగించవచ్చునని, వాటికి ఆయా దేశాల ప్రభుత్వ సాయమో, యజమానుల సహాయమో  ఉందని ఆయన వివరించారు. ఆస్ట్రేలియా ఎయిర్ వేస్ లిమిటెడ్ తో లింక్ ఉన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు తమ కెపాసిటీని చాలావరకు తగ్గించివేశాయని, అలాగే స్వీడన్ కు చెందిన ఓ ఎయిర్ లైన్స్ సంస్థ తమ స్టాఫ్ లో చాలామందికి ఉద్వాసన పలికిందని ఆయన పేర్కొన్నారు. యూరప్ లో అతి పెద్ద రీజనల్ ఎయిర్ లైన్స్ అయినా ‘ఫ్లైబే’ ఇప్పటికే కుప్పకూలిందన్నారు. ఈ ఏడాది విమాన సంస్థలు 113 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకున్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది.