విచిత్రం: 25 ఏళ్ల తర్వాత తాను అమ్మాయిని కాదు.. అబ్బాయినన్న విషయం తెలిసింది.. షాక్‌కు గురైన మహిళ

సాంకేతికపరంగానే కాకుండా సైన్స్‌ పరంగానూ ఎన్నో విచిత్రాలు జరుగుతుండటం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇలాంటి విచిత్రాలు చైనాలో..

విచిత్రం: 25 ఏళ్ల తర్వాత తాను అమ్మాయిని కాదు.. అబ్బాయినన్న విషయం తెలిసింది.. షాక్‌కు గురైన మహిళ
Woman
Follow us

|

Updated on: Mar 17, 2021 | 11:50 AM

సాంకేతికపరంగానే కాకుండా సైన్స్‌ పరంగానూ ఎన్నో విచిత్రాలు జరుగుతుండటం అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇలాంటి విచిత్రాలు చైనాలో తరచూగా కనిపిస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ఓ అమ్మాయి తాను అమ్మాయి కాదు.. అబ్బాయినన్న విషయాన్ని 25 సంవత్సరాల తర్వాత తెలుసుకుని షాక్‌కు గురైంది.

25 ఏళ్ల వివాహిత సంతానం కోసం ఏడాది పాటు ఎంతగానో ఎదురు చూస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టకపోవడంతో ఆమె వైద్యులను సంప్రదించింది. ఇక వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా, బయోలాజికల్‌ మ్యాన్‌గా పుట్టిందని నిర్ధారించారు. స్త్రీ జననేంద్రియ అవయవాలు ఉన్నప్పటికీ ఆమెలో ‘వై’ క్రోమోజోమ్‌ ఉండటం వల్ల ఆమె బయోలాజికల్‌ మ్యాన్‌గా జన్మించడానికి అసలు కారణమని వైద్యులు స్పష్టం చేశారు.

వైద్యులు ఏమంటున్నారు..?

కాగా, అరుదుగా కనిపించే ఇలాంటి వారిని ‘ఇంటర్‌సెక్స్‌’ అని పిలుస్తారు. గత పాతికేళ్లుగా అందరి అమ్మాయిల్లాగానే ఆమె తన జీవితాన్ని గడిపింది. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఆమె కాలి మడమకు గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. దానిలో ఎముకల ఎదుగుదల సరిగ్గా లేనట్లుగా గుర్తించారు. అయితే కొంతమందిలో నెమ్మదిగా ఎదుగుతారని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి రుతుక్రమం కూడా సరిగ్గా రావడం లేదని గైనకాలజిస్టుకు తెలిపినప్పటికీ కొందరు పిరియడ్స్‌ ఆలస్యం అవుతుందని చెప్పడంతో అప్పుడు కూడా ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే పురుషులలో సాధారణంగా కనిపించే ’46ఎక్స్‌,వై’ క్రోమోజోములు ఉండటం వల్ల ఆమెలో ఉన్న జననేంద్రియాలు పురుషుడివా, స్త్రీవా అనేది స్పష్టంగా గుర్తించలేమని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆమెకు అందరిలా జననేంద్రియాలు ఉండటంతో ఎప్పుడు ఎలాంటి అనుమానాలు రాలేదు. శరీరంలో గర్భాశయం కానీ అండాశయాలు ఏవీ లేవు. అందుకే రుతుక్రమం కూడా రాలేదని ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేశారు. అయితే ఇలాంటి సమస్య ఉన్న వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

విషాదం.. సెప్టిక్‌ ట్యాంకులో పడి ఐదుగురు మృతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

Eating Food: ఆహారాన్ని ఇలా తింటే.. ఆరోగ్యం పదిలం.. ఆయుర్వేదం ఏం చెబుతుందంటే?