China Ship In Srilanka: భారత్, అమెరికా అభ్యంతరాలు బేఖాతరు.. శ్రీలంకలో తిష్ట వేసిన చైనా ‘నిఘా’ నౌక..

 చైనా ఒత్తిళ్లకు శ్రీలంక తలొగ్గింది. భారత్, అమెరికా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక తమ దేశంలోని హంబన్ తోటా నౌకశ్రయంలో తిష్ట వేసేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఆమేరకు డ్రాగన్ నౌక..

China Ship In Srilanka: భారత్, అమెరికా అభ్యంతరాలు బేఖాతరు.. శ్రీలంకలో తిష్ట వేసిన చైనా 'నిఘా' నౌక..
China Ship
Follow us

|

Updated on: Aug 16, 2022 | 12:15 PM

China Ship In Srilanka: చైనా ఒత్తిళ్లకు శ్రీలంక తలొగ్గింది. భారత్, అమెరికా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా నిఘా నౌక తమ దేశంలోని హంబన్ తోటా నౌకశ్రయంలో తిష్ట వేసేందుకు శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఈమేరకు హంబన్ తోటా పోర్టుకు ఈరోజు చేరుకున్న డ్రాగన్ నౌకకు శ్రీలంక పోర్ట్ అధికారులు, నౌకా కంపెనీకి చెందిన చైనా అధికారులు స్వాగతం పలికారు. తొలుత చైనా నౌక ఈనెల 11వ తేదీనే చేరుకోవల్సి ఉండగా.. భారత్ భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో తదుపరి సంప్రదింపులు జరిగే వరకు వాయిదా వేయాలని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. చివరికి డ్రాగన్ కంట్రీ ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక చైనా నౌకకు అనుమతులు ఇచ్చింది. పక్కలో బల్లెం తరహాలో చైనా నౌక భారత్  భద్రతకు తీవ్ర విఘాతాన్ని కలిగించే అంశం. భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చనే ఆందోళన నేపథ్యంలో చైనా నౌకను అనుమతించవద్దని భారత్ శ్రీలంకకు చెప్తూ వచ్చింది. అయితే చైనా ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక, చైనా నౌకకు అనుమతి ఇచ్చింది.  చైనా నౌక భారత్ కు చెందిన వ్యవస్థలపై నిఘా ఉంచే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ దేశ జలాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిశోధన కార్యకలాపాలు నిర్వహించకూడదని శ్రీలంక విధించిన షరతుకు చైనా అంగీకరించినప్పటికి.. దీనికి ఎంత వరకు కట్టుబడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈఉదయం వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక చేరుకుందని హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీసిల్వా ధృవీకరించారు.   ఈరోజు నుంచి వారం రోజుల పాటు అంటే ఈనెల 22వ తేదీ వరకు తమ పోర్టులో ఉండేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు శ్రీలంక తెలిపింది. చైనాకు చెందిన వాంగ్ యాంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని.. అందరి ఆందోళనలు దృష్టిలో ఉంచుకునే తాము ఈనిర్ణయం తీసుకున్నామని శ్రీలంక విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు శ్రీలంకకు తమ దేశపు నౌక వెళ్లడం పట్ల భారత్, అమెరికా ఆందోళనలను చైనా తప్పుపట్టింది. నౌకకు అనుమతి ఇవ్వకుండా శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తడం సరికాదని డ్రాగన్ కంట్రీ పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్దమైన కోణంలో చూడాలని సూచించింది.

తమ దేశ భద్రతను ముప్పులో పడేస్తూ చైనా నౌకను శ్రీలంక అనుమతించడంపై భారత్ ఇప్పుడు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ పలు రకాలుగా సహాయాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు ఇటీవల సముద్ర నిఘా విమానాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. భారత్‌లో శిక్షణ పొందిన శ్రీలంక నావికాదళం, వైమానిక దళ సిబ్బంది ఈవిమానాలను నడుపుతారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇలా ఉండగా.. ఇప్పటికే శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చిన చైనా.. తన మాటవినేలా ఒత్తిడి తీసుకొస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!