China: మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

తమను తక్కువ అంచనా వేయవద్దని అమెరికాను చైనా(China) హెచ్చరించింది. తైవాన్ పై చైనా దాడి చేస్తే ఆ దేశానికి రక్షణగా ఉంటామని అమెరికా(America) అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ ఘాటుగా స్పందించింది. తైవాన్‌ విషయంలో....

China: మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్
China
Follow us

|

Updated on: May 23, 2022 | 7:38 PM

తమను తక్కువ అంచనా వేయవద్దని అమెరికాను చైనా(China) హెచ్చరించింది. తైవాన్ పై చైనా దాడి చేస్తే ఆ దేశానికి రక్షణగా ఉంటామని అమెరికా(America) అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ ఘాటుగా స్పందించింది. తైవాన్‌ విషయంలో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం చైనా సార్వభౌమాధికారం, అంతర్గత సమగ్రతకు సంబంధించినదని, ఎవరూ ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదని పేర్కొన్నారు. తైవాన్‌(Taiwan)ను చైనా బలవంతంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే తాము తైవాన్ కు రక్షణ కల్పిస్తామని యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలపై చైనా ఈ మేరకు స్పందించింది. అంతేగాక ప్రమాదంతో చైనా ఆటలాడుతోందని బైడెన్ అన్నారు. తైవాన్‌ను తమ భూభాగంగా పరిగణిస్తోన్న చైనా.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. క్వాడ్ కూటమిలోని జపాన్, భారత్, ఆస్ట్రేలియా నాయకులతో బైడెన్‌ మంగళవారం భేటీ కానున్నారు. ఇక చైనా తైవాన్‌పై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో తమ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంపై బైడెన్‌తో చర్చించినున్నట్టు జపాన్ ప్రధాని కిషిడా వ్యాఖ్యానించారు.

అంతే కాక తైవాన్‌ విషయంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్‌ హితవు పలికారు. ఉక్రెయిన్‌లో జ‌రుగుతున్న అకృత్యాల‌కు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ర‌ష్యా సుదీర్ఘ కాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు వార్తలూ వెలువడ్డాయి.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Black cold coffee Benefits: బ్లాక్ కాఫీతో నిజంగా బరువు తగ్గవచ్చా.. అసలు నిజం తెలుసుకోండి..

MLC Anantha Babu: అనంతబాబు అంతులేని కథలు.. రంగు రాళ్ల నుంచి డెడ్ బాడీ డోర్ డెలివరీ దాకా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..