China Corona: చైనాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా.. పలు నగరాల్లో లాక్ డౌన్ .. సొంత గూటికి కార్మికులు పయనం

జెంగ్‌జౌలో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. దీంతో నగరంలో ఉన్న యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు స్వగ్రామాలకు పయనం అయ్యారు. వారంతా కాలినడకన తమ ఇళ్ల వైపు వెళ్తున్నారు.

China Corona: చైనాలో మళ్ళీ విజృంభిస్తోన్న కరోనా.. పలు నగరాల్లో లాక్ డౌన్ .. సొంత గూటికి కార్మికులు పయనం
China Corona Virus
Follow us

|

Updated on: Oct 31, 2022 | 4:09 PM

దాదాపు రెండేళ్ల క్రితం చైనా పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో వణికించింది. రకరకాల రూపాయలను సంతరించుకుంటూ విలయతాండవం చేసింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ సృష్టించిన విలయం నుంచి తేరుకుంటున్నారు. అయితే మళ్ళీ  చైనా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిలాడుతోంది. అక్కడి కొన్ని నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చాలా నగరాల్లో కఠినమైన లాక్ డౌన్ విధిస్తున్నారు. తాజాగా జెంగ్‌జౌలో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. దీంతో నగరంలో ఉన్న యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు స్వగ్రామాలకు పయనం అయ్యారు. వారంతా కాలినడకన తమ ఇళ్ల వైపు వెళ్తున్నారు. ఇందుకోసం రాత్రింబవళ్లు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ఆహారం, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నల్టు తెలుస్తోంది.

తాజాగా చైనాలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలోని అనేక నగరాల్లో కోవిడ్ విజృంభిస్తోంది.  చైనాలోని పరిస్థితులను తెలియజేస్తూ..  BBC జర్నలిస్ట్ స్టీఫెన్ మెక్‌డొనెల్ ట్వీట్‌ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI పేర్కొంది. ‘జెంగ్‌జౌలోని ఫాక్స్‌కాన్‌లో లాక్‌డౌన్ విధించబడింది. ఇది Apple కంపెనీ ఉన్న ప్రాంతం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫ్యాక్టరీలో పనిచేసే ప్రజలు, కూలీలు ఇప్పుడు సొంత ఊర్లకు పరుగులు తీస్తున్నారు.

చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ యాపిల్ కంపెనీ నుంచి ఉద్యోగులు, కార్మికులు తమ ఇళ్ల వైపు కాలినడకన వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం 100 కిలోమీటర్ల వరకు కాలినడకన ప్రయాణిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన నియమాలు సెట్ చేయబడ్డాయి. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కరోనా వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కార్మికులను క్వారంటైన్‌లో ఉంచినట్లు మళ్ళీ తెరపైకి కొన్ని వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఫ్యాక్టరీలో పనిచేస్తున్న  3 లక్షల మంది  కార్మికులు 

మెక్‌డొన్నెల్ ప్రకారం..  జెంగ్‌జౌలో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ ఈ ఫ్యాక్టరీకి యజమాని. యాపిల్ ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీలో 3 లక్షల మంది కార్మికులను నియమించుకున్నాడు. ప్రపంచంలో రవాణా అవుతున్న ఐఫోన్లలో సగం ఇక్కడే తయారవుతున్నాయి. చైనా వీడియో హోస్టింగ్ సర్వీస్ డోయిన్ ప్రకారం, అక్కడ కరోనాను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్ విధించబడింది. దీంతో ఆహారం, ఇతర వస్తువుల కొరత ఏర్పడుతోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని వీధుల్లో ప్రజలు ఇంటికి వెళ్తున్న వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా మార్గాలు మూసివేయబడినందున ఈ ప్రజలు కాలినడకన తమ ఇళ్ల వైపు వెళ్తున్నారు.

పగలు, రాత్రి నడుచుకుంటు వెళ్తున్న కార్మికులు  చైనీస్ సోషల్ మీడియాలో వెలువడిన ఒక వీడియోలో, ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ కార్మికులు ఉదయం పొలాల్లో నడవడం మరియు రాత్రి వీధుల్లో నడవడం చూడవచ్చు. కొన్ని వీడియోలలో, ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ కార్మికులకు సహాయం చేయడానికి స్థానిక ప్రజలు రోడ్డు పక్కన ఆహారం, ఇతర వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా చూడవచ్చు. గత కొన్ని రోజులుగా, జెంగ్‌జౌ నగరంలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ కేసుల పెరుగుదల కనిపించింది. దీని కారణంగా, సుమారు 1 కోటి జనాభా ఉన్న ఈ నగరంలో ముందుగా పాక్షిక లాక్‌డౌన్ విధించబడింది. తర్వాత దీన్ని కఠినతరం చేశారు.

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..