జర్మనీ నుంచి పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా

జర్మనీ నుంచి పందుల దిగుమతిని చైనా ఆపేసింది. ఆ దేశంలోని పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అవ్వడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

  • Publish Date - 3:18 pm, Sun, 13 September 20 Edited By:
జర్మనీ నుంచి పంది మాంసం దిగుమతిని ఆపేసిన చైనా

China Germeny Pigs: జర్మనీ నుంచి పంది మాంసం దిగుమతిని చైనా ఆపేసింది. ఆ దేశంలోని పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అవ్వడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు చైనాకు వచ్చిన పంది మాంసాన్ని వెనక్కి పంపిస్తామని చైనీస్ కస్టమ్స్ ఆఫీస్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ తెలిపింది. మరోవైపు దీనిపై జర్మనీకి చెందిన ఆహార, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. చైనా అధికారులతో తాము చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి నమోదైన ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతాల నుంచి పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా జర్మనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే చైనాకు మాంస ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో జర్మనీ మూడో స్థానంలో ఉంది. పంది చెవులు, కాళ్లు, తోకను చైనాకు ఎగుమతి చేసేవారు. ఇక పంది మాంసం ఎగుమతికి బ్రేక్ వేయడంతో తాము వీటిని ఎక్కడ అమ్ముకోవాలంటూ జర్మనీ రైతులు అంటున్నారు. 

Read More:

సుశాంత్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన మాజీ డ్రైవర్

ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. విజయ దేవరకొండ టీమ్‌ క్లారిఫికేషన్‌